డబ్బుకి కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సహకరించిన ఖాకీ.. దర్యాప్తులో మరిన్ని విషయాలు

By telugu teamFirst Published Jan 16, 2020, 10:17 AM IST
Highlights

హై సెక్యూరిటీ విమానాశ్రయమైన శ్రీనగర్ లో యాంటీ హైజాక్ యూనిట్ డీఎస్పీగా దవీందర్ సింగ్ పనిచేయడంతో భద్రతా సంస్థల అధికారులు జరిపిన దర్యాప్తులో మిలిటెంట్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని తేలింది.
 

ఖాకీ ఉగ్రవాది దవీందర్ సింగ్ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ దర్యాప్తులో పోలీసులకు రోజుకో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను కారులో తరలిస్తూ శ్రీనగర్ విమానాశ్రయ డీఎస్పీ దవీందర్ సింగ్ పట్టుపడటంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలకు చెందిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హై సెక్యూరిటీ విమానాశ్రయమైన శ్రీనగర్ లో యాంటీ హైజాక్ యూనిట్ డీఎస్పీగా దవీందర్ సింగ్ పనిచేయడంతో భద్రతా సంస్థల అధికారులు జరిపిన దర్యాప్తులో మిలిటెంట్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని తేలింది.

శ్రీనగర్ విమానాశ్రయం రికార్డులను ఇంటలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), బాహ్య ఇంటలిజెన్స్ ఎజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ(ఎన్ఐఏ), జమ్మూకశ్మీర్ పోలీసులు పరిశీలించగా దవీందర్ సింగ్ డబ్బులకు కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సహకరించినట్లు తేలింది. 

Also Read దారుణం... మూగ బాలికపై సామూహిక అత్యాచారం

శ్రీనగర్ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన దర్యాప్తు అధికారులు షాకయ్యారు. గతంలో దవీందర్ సింగ్ కశ్మీర్ లోయ నుంచి ఉగ్రవాదులను శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమానాల ద్వారా తరలించారని తేలింది. శ్రీనగర్ విమానాశ్రయంలోని హైజాక్ వ్యతిరేక విభాగంలో పనిచేసిన దవీందర్ కీలక సమాచారాన్ని  ఉగ్రవాద గ్రూపులకు చేరవేశాడని దర్యాప్తులో తేలింది. 

అంతకు ముందు దవీందర్ జమ్మూకశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూపులో డీఎస్పీగా పనిచేశాడు. అప్పట్లోనూ అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా డబ్బు కోసం ఉగ్రవాదులకు ఇచ్చాడని భద్రతా అధికారుల ఇంటరాగేషన్ లో తేలింది. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అప్జల్ గురుతో దవీందర్ సింగ్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దవీందర్ సింగ్ సూచనల మేరకే తాను ఓ ఉగ్రవాదిని ఢిల్లీకి రప్పించానని అఫ్జల్ గురు తన న్యాయవాది రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో ఖాకీ ఉగ్రవాది రవీందర్ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ డీఎస్పీగా పనిచేశాడు. 

click me!