వలస కూలీల బస్సు ఛార్జీలను ప్రభుత్వాలే భావించాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published May 28, 2020, 5:12 PM IST
Highlights

వలస కూలీలను స్వంత రాష్ట్రాలకు తరలించే సమయంలో బస్సు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల సమస్యలపై సుప్రీంకోర్టు గురువారం నాడు విచారించింది.

న్యూఢిల్లీ:వలస కూలీలను స్వంత రాష్ట్రాలకు తరలించే సమయంలో బస్సు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల సమస్యలపై సుప్రీంకోర్టు గురువారం నాడు విచారించింది.

వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. వలస కార్మికుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించింది. వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించి  వారికి కనీస సదుపాయాలు, భోజనం అందించాలని కోరింది.

also read:దారుణం: అద్దె చెల్లించలేదనే భార్యాభర్తలను కాల్చిచంపాడు

వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు  వీలుగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన విషయమై ప్రభుత్వాలు ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. వలస కూలీల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఈ లోపుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  తమ అభిప్రాయాలను చెప్పాలని సూచించింది.లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల నుండి వలస కార్మికులు తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో వందలాది మంది కాలినడకనే బయలుదేరారు.

కొందరు సైకిళ్లు, మరికొందరు బైకులపై కూడ వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చును భరిస్తూ శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులను తరలిస్తున్న విషయం తెలిసిందే.

click me!