లిక్కర్ కొనుక్కోవాలంటే.. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే: ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 3, 2021, 2:32 PM IST
Highlights

తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఉండే వాళ్లకు వ్యాక్సినేషన్ వేసుకుంటేనే ఆల్కహాల్ అమ్మాలని జిల్లా కలెక్టర్ దివ్యా మద్యం దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదంటే సింగిల్ డోసేజ్ తీసుకున్నా సరిపోతుందని అర్హత ఉన్నవాళ్లంతా వ్యాక్సిన్ కోసం రావాలని చెప్పారు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్ రేటును పెంచేందుకు కొత్త దారి కనిపెట్టారు. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఉండే వాళ్లకు వ్యాక్సినేషన్ వేసుకుంటేనే ఆల్కహాల్ అమ్మాలని జిల్లా కలెక్టర్ దివ్యా మద్యం దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదంటే సింగిల్ డోసేజ్ తీసుకున్నా సరిపోతుందని అర్హత ఉన్నవాళ్లంతా వ్యాక్సిన్ కోసం రావాలని చెప్పారు. ఇప్పటికే 97శాతం మందిని కవర్ చేశారు.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని అన్ని రకాలుగా కష్టపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. నీలగిరీ ప్రాంతంలో ఉండే వారు కనీసం ఒక్క డోసైనా వేసుకోవాల్సిందేనని.. కొందరేమో ఇంకా మేం ఆల్కహాల్ తీసుకోం. వ్యాక్సిన్ వేసుకోం అంటున్నారని ఆమె చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆల్కహాల్ కొనేవారికి తప్పనిసరిగా ప్రూఫ్ చూపించాలని పెట్టాం దివ్య తెలిపారు.

కేరళ, కర్ణాటకలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. జిల్లా కలెక్టర్ ఆ రాష్ట్రాల్లోకి ప్రవేశించేవాళ్లు ఈ - రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్లతోనే రావాలని తెలిపారు. లేదంటే 72 గంటల లోపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్న రిజల్ట్స్ ను చూపించాలని పేర్కొన్నారు.

click me!