టిప్పు సుల్తాన్‌ను ప్రేమించే వారు కాదు.. రామ, హనుమ భక్తులే ఇక్కడ ఉండాలి: కర్ణాటక బీజేపీ చీఫ్

Published : Feb 15, 2023, 04:25 AM IST
టిప్పు సుల్తాన్‌ను ప్రేమించే వారు కాదు.. రామ, హనుమ భక్తులే ఇక్కడ ఉండాలి: కర్ణాటక బీజేపీ చీఫ్

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మత రాజకీయాన్ని శరవేగంగా ముందుకు తెస్తున్నది. ఈ ఎన్నికలు టిప్పు సుల్తాన్‌కు సావర్కర్‌కు మధ్య జరుగుతున్నాయని పేర్కొన్న కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్ తాజాగా టిప్పు వారసులు ఇక్కడ ఉండటానికి వీల్లేదని, రామ, హనుమాన్ భక్తులే ఇక్కడ ఉండాలని అన్నారు.  

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను టీప్పు వర్సెస్ సావర్కర్ అని పేర్కొన్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్ తాజాగా మరో వివాదానికి తెర తీశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టిప్పు సుల్తాన్‌ను ఆరాధించే వారు కాదు.. రాముడు, హనుమాన్‌ను పూజించే వారు మాత్రమే ఇక్కడ ఉండాలని అన్నారు. టిప్పు సుల్తాన్ వారసులందరినీ వారి ఇంటికి తరిమి కొట్టాలని, రాముడు, హనుమంతుడికి ఓటు వేయాలని పేర్కొన్నారు.

‘మనం రామా, హనుమాన్ భక్తులం. టిప్పు వారసులం కాదు. టిప్పు సుల్తాన్ వారసులను వారి ఇంటికి తరిమేసేయాలి’ అని బీజేపీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు.

‘హనుమాన్ భూమిలో నేను సవాల్ విసురుతున్నా.. టిప్పును ప్రేమించే వారు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. రామ భజనలు, హనుమాన్‌కు పూజలు చేసే వారు మాత్రమే ఇక్కడ ఉండాలి’ అని అన్నారు. 

Also Read: టిప్పు సుల్తాన్‌ను నమ్మే వారు ప్రజలకు మేలు చేయలేరు: కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై అమిత్ షా మండిపాటు.

గతంలో ఆయన రోడ్లు, మురికి నీటి పారుదల వంటి సమస్యలపై దృష్టి పెట్టకూడదని నలిన్ కతీల్ పార్టీ క్యాడర్‌కు సూచనలు చేశారు. వాటికి బదులు లవ్ జిహాద్ పై చూపు సారించాలని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు, వామపక్ష నక్సలిజాన్ని నియంత్రించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) వంటి సంస్థల చర్యలను కేంద్ర ఏజెన్సీలు, పోలీసు బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని, పీఎఫ్‌ఐపై ఆంక్షలు విధించడంలో కేంద్రం విజయం సాధించిందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత నిబద్ధత, ఎంత బలం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని షా అన్నారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) 74వ బ్యాచ్ ప్రొబేషనర్ల దీక్షా కవాతులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదన్న విధానం, ఉగ్రవాద నిరోధక చట్టాలకు పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్, ఏజెన్సీల పటిష్టత, రాజకీయ సంకల్ప బలం వల్ల ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం