ఇద్దరినీ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆప్ ఎమ్మెల్యే.. ఒకే ఇంటిలో ఇద్దరు భార్యలతో సంసారం.. కలిసే వాలెంటైన్స్ డే వేడుక

Published : Feb 15, 2023, 03:19 AM IST
ఇద్దరినీ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆప్ ఎమ్మెల్యే.. ఒకే ఇంటిలో ఇద్దరు భార్యలతో సంసారం.. కలిసే వాలెంటైన్స్ డే వేడుక

సారాంశం

గుజరాత్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే చైతర్ వాసవ ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇప్పుడు ఒకే ఇంటిలో ముగ్గురూ కలిసే ఉంటున్నారు. ఆ ఇద్దరి సహకారంతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని చైతర్ వాసవ అంటున్నారు.  

గుజరాత్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదీ ఆ ఇద్దరు మహిళల ఒప్పందంతో పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. వారిద్దరితో కలిసి ఒకే ఇంటిలో దాంపత్య జీవితం సాగిస్తున్నాడు. వారు ముగ్గురూ సంతోషంగా జీవిస్తున్నారు. ఈ ఏడాది వారు ముగ్గురూ కలిసే వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం. వాలెంటైన్స్ డే సందర్భంగా వారు తమ ప్రేమ గురించి ఇండియా టుడే మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆ ఆప్ ఎమ్మెల్యే పేరు చైతర్ వాసవ.

వారి లవ్ స్టోరీ:

చైతర్ వాసవ తొలుత శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. చైతర్ వాసవ, శకుంతలలు కలిసే చదువుకున్నారు. క్లాస్ మేట్లు. ముందు ఫ్రెండ్స్‌గా ఉన్నప్పటికీ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అది పెళ్లి వరకు తీసుకెళ్లిందని చైతర్ వాసవ తెలిపారు. 

అదే విధంగా చైతర్ వాసవకు వర్షతోనూ పరిచయం ఉన్నది. ఆమె కూడా అదే గ్రామానికి చెందిన యువతి. వర్షకు చైతర్ వాసవతో సత్సంబంధాలే ఉండేవి. సామాజికంగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత వారి మధ్య కూడా ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని చైతర్ వాసవ తన భార్య శకుంతలకు తెలిపారు.

శకుంతల ముందుకు తాను వర్ష ప్రస్తావన తీసుకెళ్లానని చైతర్ వాసవ చెప్పారు. వర్షకు, తనకు మధ్య ప్రేమ ఉన్నదని వివరించానని పేర్కొన్నారు. అందుకు శకుంతల ఒక ప్రశ్న అడిగిందని, తమ ఇధ్దరితో వర్షకు కలిసి ఉండటానికి అభ్యంతరం లేకుంటే ఒకసారి తన వద్దకు తీసుకువస్తే మాట్లాడతానని తెలిపిందని అన్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసిపోయారని, అనంతరం, తాను వర్షను కూడా పెళ్లి చేసుకున్నానని వివరించారు. ఇప్పుడు తాము ముగ్గురం పిల్లలతో సంతోషంగా గడుపుతున్నామని పేర్కొన్నారు.

Also Read: వాలెంటైన్స్ డే ఇన్‌స్టా పోస్టుతో అడ్డంగా దొరికిపోయిన శుబ్‌మన్ గిల్.. సారా టెండూల్కర్ పిక్ షేర్ చేసిన ఫ్యాన్స్

భార్యల సపోర్ట్‌తో ఎమ్మెల్యే:

ఈ ట్రైబల్ ఎమ్మెల్యేను ఆప్ 2022లో గుజరాత్ అసెంబ్లీలో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. అంతకు ముందు తనకు ఏమీ లేదని, తన భార్యలు వచ్చిన తర్వాత, వారి సహకారంతో ఇప్పుడు తాను ఎమ్మెల్యే అయ్యానని చైతర్ వాసవ తెలిపారు. అంతేకాదు, ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురం కలిసి తీసుకుంటామని చెప్పారు.

ఆ ఇద్దరు భార్యలు సొంత అక్కా చెళ్లెళ్లుగా కలిసి మెలిసి ఉంటారని, తనతోపాటు వారు కూడా రాజకీయ, సామాజిక విషయాల్లో పాలుపంచుకుంటారని వాసవ వివరించారు. ప్రతి పనిని పంచుకుంటామని చెప్పారు. తామంతా చదువుకున్నోళ్లం కావడం చేత బేధాభిప్రాయాలు రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. ఇదే తాము కలిసి ఉండటానికి సక్సెస్ ఫార్ములా అని పేర్కొన్నారు.

వాలెంటైన్స్ డే సెలబ్రేషన్:

గతంలో గులాబీ పూవులు ఇచ్చి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేవాళ్లం అని, ఇప్పుడు ఆ దశ దాటిపోయామని వాసవ అన్నారు. ఇప్పుడు సాయంత్రం అంతా కలిసి, తమ తల్లిదండ్రులనూ చేర్చుకుని కలిసి వంటచేసుకుని తిని ఈ వేడుక జరుపుకుంటామని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?