ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట‌ర్ల‌లో మాత్ర‌మే ఉంది - గుజరాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్

Published : Mar 28, 2022, 01:58 PM IST
ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట‌ర్ల‌లో మాత్ర‌మే ఉంది - గుజరాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్

సారాంశం

ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా, ఏ రాష్ఠ్ర ఎన్నికల్లో అయినా పోటీ చేయవచ్చని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం పోస్టర్లలో మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. ఈ ఏడాది చివరిలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఏడాది చివ‌రిలో జ‌రిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రో సారి బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌, సీఎం భూపేంద్ర పటేల్ ధీమా వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధిస్తుంద‌ని అన్నారు. ఆరో సారి మేమే అధికారం చేప‌డుతామ‌ని అన్నారు. 

గతంలో గుజరాత్ ఎన్నికల పోరులో బీజేపీకి కాంగ్రెస్ కు మ‌ధ్యే పోటీ ఉండేది. అయితే ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ ఏడాదిలో గుజ‌రాత్ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర యాద‌వ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

సోమవారం మీడియాతో మాట్లాడిన గుజ‌రాత్ సీఎం భూపేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ‘‘ ఆప్ లేక ఏ పార్టీ అయిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు. ఇది మన ప్రజాస్వామ్యంలో భాగం. ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే మేము ప్ర‌త్యేకంగా ఎన్నికల కోసం ఎప్పుడూ పని చేయ‌ము. గాంధీనగర్‌లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తుడిచి పెట్టుకుపోయింది. అయితే బీజేపీ 44 వార్డులకు గాను 41 కైవసం చేసుకుంది.’’ అని అన్నారు.

ఇప్పుడే ఎన్నిక‌ల విష‌యం మాట్లాడ‌టం చాలా తొంద‌రే అవుతుంద‌ని సీఎం చెబుతూనే.. ఆప్ పోస్టర్లలో మాత్రమే ఉందని అన్నారు. ‘‘ భారతదేశంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది. గుజరాత్‌లో ఆప్ లేదా కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా కొన్ని సీట్లు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకుంటే ఇవ్వొచ్చు. రాష్ట్రంలో బీజేపీ గుజరాత్ ప్రజల స్థిరమైన ఎంపికగా ఉంది. మేము మళ్లీ కొనసాగుతాం. మేము కష్టపడి పని చేస్తూనే ఉంటాము. అయితే మేము ఆరో సారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నాం. మేము గుజరాత్ ప్రజలకు మేము ఉత్తమ ఎంపిక అని మా ట్రాక్ రికార్డ్ రుజువు చేస్తోంది ’’ అని ఆయ‌న అన్నారు. 

బీజేపీలోని ప్రతి కార్యకర్త ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారని సీఎం భూపేంద్ర యాదవ్ అన్నారు. ‘‘ పార్టీలోని ప్రతీ కార్యకర్త ప్రధాని మోడీ నుంచి ప్రేరణ పొందడం సహజం. మేము ఆయ‌న ప‌నిని ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఎవరూ ఆయన చెప్పుచేతల్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడరు ’’ అని సీఎం తెలిపారు. 

గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి సీఎం విజయ్ రూపానీ రాష్ట్ర కేబినెట్‌ను పూర్తిగా బీజేపీ హైక‌మాండ్ పూర్తిగా పునర్వ్యవస్థీక‌రించింది. దీంతో భూపేంద్ర యాద‌వ్ కు సీఎం అయ్యారు. రాష్ట్రంలో గార్డుల మార్పు జ‌రిగిందని.. కానీ బీజేపీ క్రమశిక్షణ పాటించే కార్యకర్తల పార్టీ అని సీఎం తెలిపారు. త‌మ ప్ర‌భుత్వానికి పార్టీకి స‌మ‌న్వ‌య లోపం లేద‌ని తెలిపారు. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని 99 స్థానాల‌కు ప‌రిమితం చేసింది. అయితే త‌రువాత అనేక మంతి కాంగ్రెస్ నాయ‌కులు బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజ‌రాత్ అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ బ‌లం 111 స్థానాల‌కు పెరిగింది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?