Bengaluru: ఫొటోలు షేర్ చేయలేదని యువకుడి హత్య.. దాబా ముందు ఘటన

బెంగళూరులోని ఓ దాబా ముందు దారుణ ఘటన జరిగింది. సూర్య, మరో ముగ్గురు మిత్రులతో కలిసి అక్కడ ఫొటోలు తీస్తుండగా మరో ఐదుగురు గ్రూపుగా అక్కడికి వచ్చారు. వారి ఫొటోలను తీయాలని విజ్ఞప్తి చేయగా.. సూర్య, ఆయన మిత్రులు తీశారు. ఆ ఫొటోలను వెంటనే పంపించాలని ఆ గ్రూపు డిమాండ్ చేసింది. వాటిని క్యామెరాలో తీశాను కాబట్టి, వెంటనే పంపించడం సాధ్యం కాదని 
 

one youth murdered for not sharing photos immediately in karnatakas bengaluru kms

బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫొటోలు షేర్ చేయలేదని రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపేశాడు. ఈ ఘటన బెంగళూరులోని ఓ దాబా వద్ద దీపావళి రోజున అంటే ఆదివారం చోటుచేసుకుంది. మృతుడిని సూర్యగా గుర్తించారు.

సూర్య మరో ముగ్గురు మిత్రులతో కలిసి దాబా ఎంట్రెన్స్ ఫొటోలను క్లిక్ చేశారు. అప్పుడే మరో గ్రూప్ వచ్చింది. వారు అదే ఎంట్రెన్స్ ముందు నిలబడి ఫొటోలకు పోజులు ఇచ్చారు. కానీ, సూర్య ఫొటోలు తీయడానికి నిరాకరించాడు. అయితే తమ ఫొటోలు తీయాలని సూర్యను బ్రతిమిలాడారు. దీంతో సూర్య, ఆయన మిత్రులు చివరకు కన్విన్స్ అయ్యారు. వారి ఫొటోలను తీశారు.

Latest Videos

ఆ ఫొటో సెషన్ అయిపోయాక సూర్య, ఆయన మిత్రులను ఫొటోలు పంపించాల్సిందిగా కోరారు. కానీ, అది ఇప్పుడు సాధ్యం కాదని వారు చెప్పారు. లేదు.. లేదు.. ఇప్పటి వరకు దిగిన ఫొటోలను ఇప్పుడే తమకు షేర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వారి ఫొటోలను క్యామెరా ద్వారా తీశారు. క్యామెరా ద్వారా ఫొటోలు తీశాను కాబట్టి, ఇప్పుడే ఫొటోలను వారికి షేర్ చేయలేనని, వాటిని ముందుగా సిస్టమ్‌కు కనెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సూర్య వారికి వివరించి చెప్పాడు. కానీ, వారు వినలేదు.

తమకు ఆ ఫొటోలు ఇప్పుడు పంపించాల్సిందేనని ఒత్తిడి చేశారు. వాదం పెట్టుకున్నారు. అది చిన్న గొడవగా మారింది. అందులో దిలీప్ అనే నిందితుడు పదునైన ఒక ఆయుధాన్ని తీసుకువచ్చి సూర్యను పొడిచేశాడు. సూర్యను వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే సూర్య మరణించాడు.

Also Read : గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు?.. ఎంఐఎం నేత తీవ్ర ఆరోపణలు

పోలీసులు ఐదుగురు నిందితులపై మర్డర్ కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిలో ఇద్దరిని గుర్తించగలిగామని చెప్పారు. త్వరలోనే మిగిలిన వారినీ గుర్తించి అరెస్టు చేస్తామని వివరించారు.

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image