ఒకే దేశం ఒకే ఎన్నిక : నేడు జెమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక

Published : Sep 27, 2023, 11:02 AM IST
ఒకే దేశం ఒకే ఎన్నిక : నేడు జెమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక

సారాంశం

జెమిలీ ఎన్నికలపై లా కమిషన్ తన నివేదికకు కమిటీకి నేడు సమర్పించనుంది. లా కమిషన్ తో పాటు మిగిలిన సభ్యులు కూడా ఈరోజు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు. 

ఢిల్లీ : దేశంలో  జెమిలీ ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నేడు సమావేశం కానుంది. మాజీ రాష్ట్రపతి, కమిటీ అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ కు లా కమిషన్ తన సూచనలను నేడు అందించనుంది. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ మీద సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కావలసిన సూచనలు, సలహాలు అందించాలని గతవారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ భేటీలో కోరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే లా కమిషన్ తో పాటు మిగిలిన సభ్యులు కూడా ఈరోజు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు.  ఈ మేరకు అందరి సూచనలు తీసుకున్న తర్వాత మరోసారి ఉన్నత స్థాయి కమిటీ చివరిగా భేటీ నిర్వహించనుంది. జెమిలీ ఎన్నికల పరిశీలనకు సెప్టెంబర్ రెండవ తేదీన 8మందితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశం అయ్యింది. 

ఇయర్‌ఫోన్‌ విషయంలో గొడవ.. తోటి స్నేహితుడిని రాళ్లతో కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు...

కేంద్రం దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, పంచాయితీలు,  మునిసిపాలిటీలు.. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  జెమినీ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయని ఊహాగానాలు ఊపొందుకుంటున్నాయి.  బిజెపి మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే జెమినీ ఎన్నికలకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు