మథురలో రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు..

Published : Sep 27, 2023, 10:09 AM IST
మథురలో రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వివరాలు.. ఉత్తర రైల్వేకు చెందిన షకుర్‌బస్తీ-మథుర MEMU (04446).. రాత్రి 10:48 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు గమ్యస్థానం చేరుకున్నాక ప్రయాణికులు అందులో నుంచి దిగిపోయారు. అయితే ఐదు నిమిషాల తర్వాత రైలు.. ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చి.. ఓవర్‌హెడ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 

ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో లోకో పైలట్లు, ప్రయాణికులు లేరని చెబుతున్నారు. మథుర రైల్వే స్టేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికులంతా అప్పటికే రైలు దిగిపోయారని చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ ఘటనతో అప్‌లైన్‌లో కొన్ని రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్