ఐదుగురితో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్త విస్తరణ

By narsimha lodeFirst Published Apr 21, 2020, 2:41 PM IST
Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని మంగళవారం నాడు విస్తరించారు. ఐదుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు సీఎం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల తర్వాత శివరాజ్‌సింగ్ చౌహాన్  తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
 

భోపాల్:మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని మంగళవారం నాడు విస్తరించారు. ఐదుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు సీఎం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల తర్వాత శివరాజ్‌సింగ్ చౌహాన్  తన మంత్రివర్గాన్ని విస్తరించారు.

గత మాసంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.మంగళవారం నాడు గవర్నర్ లాల్జీ టాండన్ ఐదుగురు మంత్రులతో ప్రమాణం చేయించారు.

మాజీ మంత్రి ఆరు దఫాలు  ఎమ్మెల్యేగా ఎన్నికైన నర్వోత్తం మిశ్రా, మినా సింగ్, కమల్ పటేల్, తులసీరామ్ షీలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ లకు సీఎం చోటు కల్పించారు.

గత మాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.కీలకమైన ఆరోగ్యశాఖతో పాటు ఇతర కీలకమైన శాఖలను ఎవరికీ కేటాయించలేదు.మే 3వ తేదీ తర్వాత మరోసారి కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ఐదుగురు మంత్రులు రాష్ట్రంలోని ఐదు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రోడ్లపైనే గుంజీలు తీయించిన పోలీసులు

బుందేల్‌ఖండ్, సెంట్రల్ మధ్యప్రదేశ్, మాల్వా-నిమార్, మహాకోశల్, గ్వాలియర్-చంబల్ రీజియన్లకు చెందినవారు.దేశం కరోనాపై పోరాటం చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అదికారంలోకి వచ్చింది.కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఐదుగురు మాత్రం మాస్కులు ధరించలేదు. గవర్నర్, సీఎంతో పాటు ఈ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు మాస్కులు ధరించారు.

మధ్యప్రదేశ్రాష్ట్రంలో ఇప్పటికి 1485 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ వైరస్ సోకి 74 మంది మృతి చెందారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రంలో కనీసం ఆరోగ్య శాఖకు మంత్రి లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేరని కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఓ అధికారి  సమర్ధించలేదు. ముఖ్యమంత్రే ప్రస్తుతానికి ఆరోగ్యశాఖ మంత్రి అని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!