ప్రధాని మోడీ కీల‌క నిర్ణ‌యం.. ఇక ఆక్సిజ‌న్ కొర‌త‌కు చెక్..!

By Siva KodatiFirst Published Apr 28, 2021, 10:22 PM IST
Highlights

కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభణతో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి ల‌క్ష పోర్ట‌బుల్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల సేక‌ర‌ణ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే కొనుగోలు చేసి వీలైనంత త్వ‌ర‌గా వైరస్ తీవ్రత ఎక్కువగా వున్న రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని మోడీ సూచించార‌ని పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభణతో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి ల‌క్ష పోర్ట‌బుల్ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల సేక‌ర‌ణ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే కొనుగోలు చేసి వీలైనంత త్వ‌ర‌గా వైరస్ తీవ్రత ఎక్కువగా వున్న రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని మోడీ సూచించార‌ని పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఇటీవ‌ల మంజూరు చేసిన 713 పీఎస్ఏ ప్లాంట్ల‌కు అద‌నంగా మ‌రో 500 నూత‌న ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను మంజూరు చేసిన‌ట్టు పీఎంఓ తెలిపింది. మ‌రోవైపు ఆక్సిజ‌న్ స‌మీక‌రించేందుకు ఐఏఎఫ్‌, డీఆర్డీఓలు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టాయి. ఆక్సిజ‌న్ డిమాండ్ ను అధిగ‌మించేందుకు దుబాయ్, సింగపూర్ ల నుంచి ఐఎఎఫ్ సింగ‌పూర్, దుబాయ్‌ల నుంచి తొమ్మిది క్ర‌యోజ‌నిక్ కంటెయిన‌ర్ల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చింది.

ఈ ప్లాంట్లు జిల్లా కేంద్రాలు, టైర్ 2 నగరాల్లోని ఆసుపత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్లాంట్ల నుంచి ఆసుపత్రులకు రవాణా చేసేందుకు వున్న సవాళ్లను పరిష్కరించాల్సి వుంది.

అంతకుముందు కోవిడ్ 19 పరిస్ధితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ మంగళవారం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, నీతి అయోగ్ సభ్యుడు, ఐసీఎంఆర్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:కోవిడ్: మరుగునపడ్డ వాస్తవాలు, తప్పుదారి పట్టించిన కథనాలు

ఆక్సిజన్ లభ్యత, మందులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిస్ధితులను ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పీఎస్ఏ ప్లాంట్లను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కోరారు. దేశంలో ఆక్సిజన్ సరఫరాను పెంచే పనిలో వున్న ఎంపవర్డ్ గ్రూప్ చేస్తున్న కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. 

అయితే ఈ ఉత్పత్తి ఆసుపత్రులకు చేరటం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం... ప్రస్తుతం దేశంలో రోడ్డు ద్వారా ప్రయాణించే 1172 ఆక్సిజన్‌ క్రయోజెనిక్‌ ట్యాంకర్లున్నాయి. కరోనా వచ్చేదాకా ఇవి దేశ అవసరాలకు సరిపోయేవి.

కానీ... సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని నలుమూలలకు ఆక్సిజన్‌ను సప్లయ్‌ చేయటానికి ఇవి సరిపోవడం లేదు. దీంతో... నైట్రోజన్‌, ఇతర వాయు ట్యాంకర్లను ఆక్సిజన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. అంతేగాకుండా కొత్తవి తయారు చేయటం మొదలెట్టారు. ఇటీవలే టాటా గ్రూపు 24 క్రయోజెనిక్‌ సిలిండర్లను సింగపూర్‌ నుంచి కొనుగోలు చేసి తెప్పించింది.

 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!