అరుణాచల్ ప్రదేశ్ లో 19 మంది కార్మికులు అదృశ్యం: ఒకరి డెడ్ బాడీ గుర్తింపు

Published : Jul 19, 2022, 10:00 AM ISTUpdated : Jul 19, 2022, 10:18 AM IST
అరుణాచల్ ప్రదేశ్ లో 19 మంది కార్మికులు అదృశ్యం: ఒకరి డెడ్ బాడీ గుర్తింపు

సారాంశం

అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రంలోని ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో  ఒక కార్మికుడు మరణించాడు. మరో 18 కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఈ నెల 5వ తేదీ నుండి 19 కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ కి వచ్చిన 19 కూలీలు కన్పించకుండా పోయారు.

న్యూఢిల్లీ: Arunachal Pradesh రాష్ట్రంలోని కురుంగ్ కుమే ప్రాంతంలో గల Indo-China  సరిహద్దు సమీపంలో ఒక Labourer మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. Damin సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న 19 మంది కూలీలు ఈ నెల 5వ తేదీన అదృశ్యమయ్యారు.ఈ అదృశ్యమైన 19 మంది కూలీల్లో ఒకరు మృత్యువాత పడ్డారు. అయితే మిగిలిన 18 మది ఎక్కడ ఉన్నారనే విషయమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు.  ఈ నెల 5వ తేదీన నిర్మాణ స్థలం నుండి కార్మికులు కన్పించకుండా వెళ్లారు. అయితే ఈ 19 మందిలో ఒకరి మృతదేహన్ని నదిలో గుర్తించినట్టుగా డిప్యూటీ కమిషనర్ బెంగియా నిఘి తెలిపారు. 

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను చేపడుతుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన డామిన్ సర్కిల్ లో రహదారి నిర్మించేందుకు ఈ కూలీలు పనికి వచ్చారు. Assam రాష్ట్రం నుండి ఈ కూలీలు అరుణాచల్ ప్రదేశ్ కు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ఈద్ పండుగను జరుపుకొనేందుకు అనుమతివ్వాలని కోరితే కాంట్రాకర్టర్ నిరాకరించడంతో కాలినడకన కూలీలు కురుంగ్ కుమే ప్రాంతానికి వెళ్లినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు.కురుంగ్ కుమే ప్రాంతంలో దట్టమైన అడవుల్లో కన్పించకుండా పోయారని పోలీసులు తెలిపారు. 

కోలోరియాంగ్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని స్థలం నుండి కార్మికులు తప్పించుకున్నారని ఈ నెల 13న తమకు సమాచారం వచ్చిందని బెంగియా నిఘి చెప్పారు. నిర్మాణ స్థలం నుండి కూలీలు ఎందుకు వెళ్లిపోయారా తెలియదని కాంట్రాక్టర్ చెబుతున్నారు.  గల్లంతైన కూలీల గురించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. అయితే ఎక్కడా కూడా వారి ఆచూకీ లభ్యం కాలేదు,. అయితే సోమవారం నాడు పురాక్ నది నుండి ఓ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నామని నిఘి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు