Kerala NEET Exam Row : విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై పోలీస్ కేసు, త్వరలో అరెస్టులు..

Published : Jul 19, 2022, 09:29 AM ISTUpdated : Jul 19, 2022, 09:38 AM IST
Kerala NEET Exam Row : విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై పోలీస్ కేసు, త్వరలో అరెస్టులు..

సారాంశం

కేరళలలో నీట్ పరీక్ష రాసిన మహిళా అభ్యర్థులకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బ్రాలు తొలగించి పరీక్ష రాయాలని బలవంతపెట్టిన వారిపై పోలీస్ కేసు నమోదు చేశారు. 

కేరళ : కేరళలో  కొల్లాం జిల్లాలో సోమవారం జరిగిన National Eligibility-cum-Entrance Test లేదా NEET పరీక్షకు హాజరైన యువతులను పరీక్ష రాయాలంటే Bra తొలగించాలన్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కేరళ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌లు 354 (ఆమె నిరాడంబరతను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం) 509 (మహిళ అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొల్లాం జిల్లా ఆయుర్‌లోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో జరిగిన నీట్ పరీక్షకు హాజరవుతుండగా అవమానకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు ఓ యువతి ఫిర్యాదులో ఆరోపించింది.

దీంతో మహిళా అధికారుల బృందం బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని, ఈ చర్యకు పాల్పడిన friskersను త్వరలో అరెస్టు చేస్తామని వారు తెలిపారు. మొదటిసారి నీట్‌ పరీక్షకు హాజరైన తన కూతురికి బాధాకరమైన అనుభవం ఎదురయ్యిందని.. దాని నుంచి ఆమె ఇంకా బయటకు రాలేదని 17 ఏళ్ల బాలిక తండ్రి సోమవారం మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రా లేకుండా 3 గంటల కంటే ఎక్కువ సమయం పరీక్ష కోసం కూర్చోవడం ఆమెను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బంది.. లేదంటే అనుమతించబోమని వార్నింగ్

నీట్ బులెటిన్‌లో అండర్‌గార్మెంట్స్ గురించి ఏమీ చెప్పలేదని.. వారి గైడ్ లైన్స్ ప్రకారమే.. అందులో పేర్కొన్న డ్రెస్ కోడ్ ప్రకారమే తన కుమార్తె దుస్తులు ధరించిందని తండ్రి ఒక టీవీ ఛానెల్‌తో చెప్పారు. దీంతో ఈ ఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ యువజన సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కొల్లం రూరల్ పోలీసు సూపరింటెండెంట్‌ను కమిషన్ ఆదేశించింది.

పదివేల మంది వైద్యవిద్యా ఆశావహులు రాస్తున్న ఈ పరీక్షల్లో నీట్ భద్రతా తనిఖీని క్లియర్ చేయడం చాలా పెద్ద సవాలుగా మారింది. అభ్యర్థులు స్టేషనరీని తీసుకెళ్లవద్దని, కఠినమైన దుస్తుల కోడ్‌ను అనుసరించాలని కోరారు. ఇందులో పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, క్యాప్‌లు, ఆభరణాలు, బూట్లు, హీల్స్ నిషేధించబడ్డాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?