తూత్తుకూడి ఫైరింగ్: తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

First Published Jun 1, 2018, 1:38 PM IST
Highlights

తమిళనాడు సర్కార్ కు కోర్టు షాక్

ముంబై: తూత్తుకూడిలో ఆందోళనకారులపై పోలీసులు
కాల్పులు జరపడాన్ని మద్రాస్ హైకోర్టు తమిళనాడు
ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ
తేదిలోపుగా  ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే
విషయమై సమాధానం ఇవ్వాలని కోర్టు  ఆదేశాలు జారీ
చేసింది.


తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడిలో  స్టెరిలైట్ ఫ్యాక్టరీని
మూసివేయలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు డిమాండ్
చేశారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన
ఆందోళనకారులపై పోలీసులు కాల్పులకు దిగారు. ఈ
ఘటనలో 13 మంది మృతి చెందగా, మరో 30 మందికిపైగా
గాయపడ్డారు.


ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై
సీరీయస్ అయింది.ఏ పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి
వచ్చిందనే విషయమై జూన్ 6వ తేదిలోపుగా సమాధానం
ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!