స్మృతి ఇరానీ కనిపడట్లేదంటూ పోస్టర్లు.. కౌంటర్ ఎటాక్ చేసిన కేంద్ర మంత్రి

By telugu news teamFirst Published Jun 2, 2020, 9:44 AM IST
Highlights

ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆమె కేవలం రెండు సార్లు మాత్రమే అడుగుపెట్టారని.. అతి కొద్ది గంటలు మాత్రమే ఇక్కడ సమయం గడిపారని.. మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఇరికిద్దామనుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం బెడసికొట్టినట్లు అయ్యింది. స్మృతీ ఇరానీ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు అంటించగా.. వాటికి కౌంటర్ ఇస్తూ.. ఆమె సమాధానం ఇచ్చారు.

ఇంతకీ మ్యాటరేంటంటే..  స్మృతీ ఇరానీ అమేథి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆమె కేవలం రెండు సార్లు మాత్రమే అడుగుపెట్టారని.. అతి కొద్ది గంటలు మాత్రమే ఇక్కడ సమయం గడిపారని.. మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఈ మేరకు బ్లాక్ అండ్ వైట్ రంగులతో పోస్టర్లు తయారు చేసి.. స్మృతీ ఇరానీ కనిపించడం లేదంటూ నియోజకవర్గం మొత్తం పోస్టర్లు అంటించారు. అయితే.. అవి కాస్త వైరల్ గా మారాయి. దీంతో.. కాంగ్రెస్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు.

తాను 8నెలల్లో పదిసార్లు నియోజకవర్గంలో పర్యటించానని.. దాదాపు 14 రోజులు అక్కడే గడిపానని స్మృతీ పేర్కొన్నారు. తన నియోజకవర్గ పర్యటన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు. అక్కడితో ఆగకుండా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కూడా ఆమె విమర్శలు చేయడం గమనార్హం.

సోనియాగాంధీ తన నియోజకవర్గమైన రాయ్ బరేలీలో ఎన్నిసార్లు పర్యటించారంటూ ప్రశ్నించారు. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ప్రజలు దాదాపు 22,150 మంది బస్సుల్లో స్వగ్రామాలకు చేరుకున్నారని ఆమె తెలిపారు. 8,322 మంది రైళ్ల ద్వారా అమేథీ చేరుకున్నారని ఆమె చెప్పారు.

ఇలాంటి సమాచారం రాయబరేలీ నియోజకవర్గం గురించి సోనియా గాంధీ ఇవ్వగలరా అని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా తాను లాక్ డౌన్ నియమాలు పాటిస్తున్నానని ఆమె చెప్పడం గమనార్హం.

click me!