కరోనా సోకిందనే బాధతో... ఉరివేసుకొని ఆత్మహత్య

By telugu news teamFirst Published Jun 2, 2020, 8:07 AM IST
Highlights

ఢిల్లీలో కరోనాతో బాధపడుతున్న 63 ఏళ్ల వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడు ఢిల్లీలోని మీఠాపూర్ నివాసి అని తెలుస్తోంది. 

కరోనా మహమ్మారి దేశ ప్రజలను పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజులు గ‌డిచేకొద్దీ కరోనా బారిన పడిన రోగుల సంఖ్య, ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మ‌న‌ దేశంలో కరోనా సోకిన రోగుల రికవరీ రేటు 50 శాతానికి చేరుకుంది.

 కాగా ఢిల్లీలో కరోనాతో బాధపడుతున్న 63 ఏళ్ల వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడు ఢిల్లీలోని మీఠాపూర్ నివాసి అని తెలుస్తోంది. వివ‌రాలు అందుకున్న‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మీఠాపూర్‌లో నివసిస్తున్న ఒక వృద్ధుడిని డయాలసిస్ కోసం మే 20 న బాత్రా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో అతనికి కరోనా టెస్ట్‌ జరిగింది. పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో బాధితుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

ఆయనకు కరోనా కి వైద్యం అందిస్తున్నారు. అయితే... కరోనా సోకిందని ఆయన మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురై.. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!