మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ, సోనియా, రాహుల్

Published : Nov 19, 2022, 11:10 AM IST
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ, సోనియా, రాహుల్

సారాంశం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆమెకు నివాళులర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధినేత్రి ఖర్గేతో కలిసి ఇందిరాగాంధీ అంత్యక్రియల స్థలమైన శక్తి స్థల్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో పాలన అంటే.. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలనే అంతగా గుర్తింపు వచ్చింది. తీరు లేని నేతగా ఎదిగింది. దేశ రాజకీయాలను ఒంటి చేతితో శాసించింది. బలమైన నాయకురాలుగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించారు. తన పాలనలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. 

శనివారం నుంచి గుజరాత్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ.. “మా మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు.  ఆమె ధైర్యాన్ని దేశం ఎప్పటికీ మరువలేదు” అని పేర్కోన్నారు.  

భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. రాహుల్ గాంధీ బుల్దానా లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు .ఇందిరా గాంధీ 105వ జయంతి సందర్భంగా మహిళా శక్తిని చాటేందుకు నేడు భారత్ జోడో యాత్రలో కేవలం మహిళలు మాత్రమే నడుస్తారు.ఈ కార్యక్రమంలో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ సహా నేతలు నివాళులర్పించారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతిని పురస్కరించుకుని రాహుల్ గాంధీతో కలిసి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులు, భారత్ జోడో యాత్రికులు మాత్రమే భారత్ జోడో యాత్రలో నడుస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ తెలిపారు.ఈ యాత్రలో మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధులు కూడా పాల్గొంటారు. భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర గుండా వెళుతున్నప్పుడు నాందేడ్, హింగోలి , వాషిం జిల్లాలను కవర్ చేయనున్నారు. ప్రస్తుతం యాత్ర అకోలా  బుల్దానా జిల్లాల మీదుగా సాగుతోంది. నవంబర్ 20న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.

రాహుల్ గాంధీకి బెదిరింపులు 

ఇండోర్‌లో రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు వచ్చింది. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపులో బెదిరింపు లేఖ లభ్యమైంది. ప్రస్తుతం ఆ లేఖను వదిలివెళ్లిన వ్యక్తి కోసం సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు వెతుకుతున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్‌లోని ఖల్సా కాలేజీ వద్ద ఆగితే బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీని ఈ లేఖలో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును పరిశీలిస్తున్నారు.

ఇందిరా గాంధీ 

భారతదేశపు మొట్టమొదటి , ఏకైక మహిళా ప్రధానమంత్రి . ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1917లో నవంబర్ 11 న జన్మించారు. ఈమె స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఆమె తల్లి కమలా నెహ్రూ కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఇందిరా గాంధీ 1966లో భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇందిరా గాంధీ తన హయాంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 1975 నుండి 1977 వరకు ఎమర్జెన్సీ విధించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌