
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ చూపించడానికి మనుషులే కావాల్సిన అవసరం లేదు. జంతువులు సైతం తల్లి ప్రేమను చాటుకుంటాయి. ఇలాంటి తల్లి ప్రేమను ఓ చింపాంజీ చూపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఓ తల్లి చింపాంజీ.. తన బేబీని కలుసుకున్న వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్ల హృదయాన్ని మెలిపెట్టేస్తోంది.. హృదయాన్ని కదిలించే క్లిప్‌ను సెడ్గ్విక్ కౌంటీ జూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంగళవారం సి-సెక్షన్ ద్వారా చింపాంజీకి సీ సెక్షన్ ద్వారా బిడ్డ జన్మించింది.
ప్రసవం తర్వాత చింపాంజీని వైద్యులు రెండు రోజుల పాటు.. ఆస్పత్రిలోనే ఉంచారు. వీడియోలో, రెండు రోజుల విడిపోయిన తర్వాత తన బిడ్డను చూసిన తర్వాత వెంటనే కౌగిలించుకుంది. తన బిడ్డపై ప్రేమ చూపించింది. పిల్ల చింపాంజీకి కుచేజా అని పేరు పెట్టారు.
వీడియో కి క్యాప్షన్ కూడా ఇచ్చారు. బిడ్డ పుట్టిన రెండు రోజుల తర్వాత... చింపాంజీ తన బిడ్డను కలుసుకుందని... ప్రసవం దానికి నార్మల్ జరగలేదని.. సీ సెక్షన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరో పోస్టులో ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.