ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో కేరళ ఖజానాకు కిక్కు.. ఒక్క రోజే రూ. 50 కోట్ల లిక్కర్ అమ్మకాలు

By Mahesh KFirst Published Dec 20, 2022, 8:48 PM IST
Highlights

కేరళలో గత ఆదివారం లిక్కర్ రికార్డు అమ్మకాలు జరిగాయి. ఆదివారానికి తోడు మలయాళీలు అధికంగా అభిమానించే ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఆ ఒక్క రోజే రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని తాజాగా కేరళ బెవ్‌కో వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: ఖతర్‌లో ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ కేరళ ఖజానాకు కిక్కు ఇచ్చింది. ఇక్కడ రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్ముడుపోయింది. ఆదివారం రోజున కేరళలో మలయాళీలు ఫైనల్ మ్యాచ్ చూస్తూ, చూశాక లిక్కర్‌తో సెలెబ్రేట్ చేసుకున్నారని అర్థం అవుతున్నది. ఆదివారం ఒక్క రోజే ఇక్కడ సుమారు రూ 50 కోట్లు లిక్కర్ కొనుగోళ్లపై కేరళ ప్రభుత్వ ఖజానాకు చేరింది. సాధారణంగా ఆదివారంలో రూ. 33 కోట్లు లేదా 34 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్ ఉంటుంది. కానీ,ఈ ఆదివారం సుమారు రూ. 50 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్టు కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (కేఎస్‌బీసీ లేదా బెవ్‌కో) వెల్లడించింది. ఈ ఆదివారం అదనంగా సుమారు 15 కోట్లు లిక్కర్ అమ్మకాలపై వచ్చాయని బెవ్‌కో సీఎండీ యోగేశ్ గుప్తా తెలిపారు.

ప్రైవేట్ బార్‌లలో అమ్మకాలను ఈ సంఖ్య వెల్లడించదు.

అది ఆదివారం, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. వెరసి ఆదివారం ఈ ఆదాయాన్ని పెంచి ఉంటాయని గుప్తా పీటీఐకి తెలిపారు. 

Also Read: విద్యుత్ చౌర్యం మర్డర్‌తో సమానమేమీ కాదు.. దోషికి శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

కాగా, రానున్న క్రిస్మస్ సీజన్‌లో మద్యం అమ్మకాలు రూ. 600 కోట్ల వరకు ఉంటాయని తాము అంచనా వేస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 21 నుంచి పది రోజులపాటు అమ్మకాలు మంచిగా ఉంటాయని అన్నారు. 

గత ఓనమ్ సీజన్ (సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) లిక్కర్ అమ్మకాలు రూ. 624 కోట్లు నమోదయ్యాయి.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటినా విజయాన్ని మలయాళీలు ఎంతో ఉత్సాహంతా వేడుక చేసుకున్నారు. ఇదిలా ఉండగా, అదే రోజు ఈ వేడుకల కారణంగా పలు హింసాత్మక ఘటనలు కూడా నమోదయ్యాయి. పలువురి పై కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి.

కేరళలో రాష్ట్ర వ్యాపితంగా 301 ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే లిక్కర్ ఔట్‌ లెట్లు ఉన్నాయి.

click me!