కర్ణాటక శాసనమండలిలో గందరగోళం: డిప్యూటీ ఛైర్మెన్‌ను లాక్కెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

Published : Dec 15, 2020, 02:40 PM IST
కర్ణాటక శాసనమండలిలో గందరగోళం: డిప్యూటీ ఛైర్మెన్‌ను లాక్కెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సారాంశం

కర్ణాటక శాసనమండలిలో మంగళవారం నాడు గందరగోళ పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. డిప్యూటీ ఛైర్మెన్ ను  భోజెగౌడను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కుర్చీ నుండి లాక్కెళ్లారు.

బెంగుళూరు:కర్ణాటక శాసనమండలిలో మంగళవారం నాడు గందరగోళ పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. డిప్యూటీ ఛైర్మెన్ ను  భోజెగౌడను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కుర్చీ నుండి లాక్కెళ్లారు.

ఛైర్మెన్ కుర్చీలో కూర్చొని అర్హత ఆయనకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆయనను కిందకు దింపారు. ఈ సమయంలో మార్షల్స్ రంగంలోకి దిగారు. 

కాంగ్రెస్ సభ్యులను బీజేపీ సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. బీజేపీ, జేడీఎస్ లు డీప్యూటీ ఛైర్ పర్సన్ ను అక్రమంగా ఆ స్థానంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ ఆరోపించింది.

సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు  డిప్యూటీ ఛైర్ పర్సన్ ను ఆ స్థానం నుండి బయటకు లాక్కెళ్లారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు, ప్రత్యర్ధి పార్టీల సభ్యుల మధ్య బాహీ బాహీ చోటు చేసుకొంది. ఒకానొక సందర్భంలో ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

సభ అదుపులో లేనప్పుడు ఛైర్మెన్ తప్పుకోవాలని విమర్శించింది. బీజేపీ, జేడీఎస్ లు రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. తప్పును సరిదిద్దేందుకు వ్యవహరించాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రకటించింది.

కర్ణాటక శాసనమండలిలో కాంగ్రెస్ కు బలం ఉంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలను గెలుచుకొంది. దీంతో బీజేపీ బలం సభలో 31కి చేరింది. మండలిలో గొడవ తర్వాత మండలి ఛైర్మెన్ సభను వాయిదా వేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు