మాజీ మంత్రి ప్రకాశ్ కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్

Siva Kodati |  
Published : Dec 14, 2020, 07:21 PM ISTUpdated : Dec 14, 2020, 07:25 PM IST
మాజీ మంత్రి ప్రకాశ్ కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్

సారాంశం

సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ మంత్రి ప్రకాశ్ కిడ్నాప్ కేసులో నిందితుడు కవిరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన డాన్ రవిపూజారి అనుచరుడే కవిరాజ్. 

సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ మంత్రి ప్రకాశ్ కిడ్నాప్ కేసులో నిందితుడు కవిరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన డాన్ రవిపూజారి అనుచరుడే కవిరాజ్.

నవంబర్ 25న మాజీ మంత్రి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి కవిరాజ్ రూ. 48 లక్షలు తీసుకున్నాడు. అనంతరం 3 రోజుల తర్వాత కిడ్నాపర్ ప్రకాశ్‌ను విడుదల చేశాడు. విడుదల చేసే వరకు కిడ్నాప్ వ్యవహారాన్ని రహస్యంగా వుంచింది ఈ ముఠా. 

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దులోని కోలారు శాసన సభ నియోజక వర్గం (కర్ణాటక) నుంచి ఆర్. వర్తూరు ప్రకాష్ రెండు సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.

కర్ణాటకలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు డిమాండ్ పెరగడంతో వర్తూరు ప్రకాష్ కు ఊహించని విధంగా మంత్రి పదవి దక్కింది. నక్కతోక తొక్కినట్లు వర్తూరు ప్రకాష్ మంత్రిగా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?