పద్ధతి మారకుంటే స్మశానానికే.. : మమతా మద్దతుదారులకు బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్

By AN TeluguFirst Published Nov 9, 2020, 10:39 AM IST
Highlights

బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం ఓ ర్యాలీలో మమతా మద్దతు దారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే కాళ్లు చేతులూ విరుగుతాయని తీవ్ర స్వరంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం ఓ ర్యాలీలో మమతా మద్దతు దారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే కాళ్లు చేతులూ విరుగుతాయని తీవ్ర స్వరంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘‘మమతా మద్దతుదారులారా.... ఎవరైతే లేని పోని ఇబ్బందులు సృష్టిస్తున్నారో బహుపరాగ్... మరో ఆరు నెలల్లోగా మీ పద్ధతిని మార్చుకోండి. లేదంటే మీ కాళ్లు చేతులూ విరుగుతాయి. అయినా మార్చుకోకపోతే నేరుగా శ్మశానవాటికకే’’ అని దిలీప్ ఘోష్  తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

మమత సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఆయన డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కాలంలో బిహార్‌లో గూండాల రాజ్యం, జంగిల్ రాజ్యం నడిచేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మార్చేసి, బీజేపీ రాజ్యాన్ని స్థాపించినట్లు తెలిపారు. జంగిల్ రాజ్‌ను కాస్త ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చేశామని, బెంగాల్ లో కూడా ఇలాగే ప్రజాస్వామ్య రాజ్యాన్ని నెలకోల్పుతామని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన అయిన రెండు రోజుల తరువాత దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని 294 సీట్లలో 200 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యం నిర్దేశించారు. 

click me!