లోకల్ ఫర్ దివాళీ: తోటి భారతీయుల జీవితాల్లో కూడా వెలుగులు నింపండి

By team teluguFirst Published Nov 9, 2020, 8:38 AM IST
Highlights

ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం చేసే ఒక చిన్న పని మన ఇండ్లతోపాటుగా తోటి భారతీయుల ఇండ్లలోనూ వెలుగులు నింపగలదు. 

మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ రాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షాపింగ్ లలో, ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమాల్లో మనమందరం బిజీగా ఉంది ఉంటాము. ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం చేసే ఒక చిన్న పని మన ఇండ్లతోపాటుగా తోటి భారతీయుల ఇండ్లలోనూ వెలుగులు నింపగలదు. 

మనం ఈ పండుగ కోసం చేసే షాపింగ్ లో చిన్న చిన్న మార్పులు చేసి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా లోకల్ నేత కార్మికులకు పని కల్పించిన వారమవుతాము. ఇండ్లలోని కార్పెట్ల దగ్గరి నుండి మన దుస్తుల వరకు మనం లోకల్ వస్తువులను వినియోగిస్తే మన ఇండ్లతోపాటు వారి ఇండ్లలోనూ దీపావళి వెలుగులు నింపిన వారమవుతాము. 

వెలుగులంటే గుర్తొచ్చింది... ఈ దీపావళికి మన ఇంటిని అలంకరించడానికి ఉపయోగించే దీపాలను కూడా చైనావి కాకుండా మన దేశీ మట్టి ప్రమిదలను కొనుగోలు చేస్తే ఆ ప్రమిదల కళాకారుడు, వారి కుటుంబం కూడా ఈ దీపావళి పండుగ రోజున దీపావళిని జరుపుకుంటారు. 

మీరు కొనుగోలు చేసి ఊరుకోకుండా మరో నలుగురిని ఇన్స్పైర్ చేయండి. అందుకు మీరు చేయవలిసిందల్లా చాలా చిన్న పని. మీరు ఈ దీపావళి షాపింగ్ లో భాగంగా కొనుగోలు చేసిన ఏదైనా చిన్న వస్తువు, దీపం నుండి దుస్తుల వరకు ఏదైనా ఒక దాని ఫోటో తీసి అది ఎవరి వద్దైతే కొన్నారో ఆ విక్రేతను #Local4Diwali అని టాగ్ చేయండి. 

నేటి ఉదయం నుండి ఈ ట్రెండ్ ప్రారంభమయితే అందరూ దీన్ని పాటిస్తే మన స్వదేశీ తయారీదారులు ఈ దీపావళి వేళ మనతోపాటుగా దీపావళిని జరుపుకోగలుగుతారు. ఈ కరోనా మహమ్మారి మనల్ని చీకట్లలోకి నెడుతున్న వేళ.... ఈ దీపావళి నాడు దీపాలను వెలిగించి ఆ చీకట్లను మన జీవితాలతోపాటు తోటి భారతీయుల జీవితాల నుండి కూడా చెరిపేద్దాము. 

click me!