Omicron scare: ఒమిక్రాన్ టెన్షన్.. మూడేళ్ల చిన్నారికి నిర్దారణ.. ముంబైలో 144 సెక్షన్..

By Sumanth Kanukula  |  First Published Dec 11, 2021, 10:14 AM IST

భారత్‌ను కూడా ఒమిక్రాన్ టెన్షన్ (Omicron scare) వెంటాడుతోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో (Maharashtra) ఏడు ఒమిక్రాన్ కేసులు నిర్దారణ జరిగింది. అయితే ఇందులో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.


భారత్‌ను కూడా ఒమిక్రాన్ టెన్షన్ (Omicron scare) వెంటాడుతోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో (Maharashtra) ఏడు ఒమిక్రాన్ కేసులు నిర్దారణ జరిగింది. అయితే ఇందులో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక, మొత్తంగా భారత్‌లో ఒమక్రిన్ కేసుల సంఖ్య 32కి చేరింది. అందులో మహారాష్ట్రలో‌ను అధికంగా 17 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమ్తమయ్యారు. ఒమిక్రాన్ పాజిటివ్‌ నిర్దారణ అయినవారిలో కొందరు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఉన్నవారు కూడా ఉండటంతో కఠిన ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. 

ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేడు, రేపు 144 సెక్షన్ (Section 144 of the CrPC) విధించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉత్తర్వులు జారీచేశారు. వీకెండ్ కావడంతో జనాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో పాటుగా, ముంబైలో ర్యాలీల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి చేయడంలో భాగంగా ముంబైలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. 

Latest Videos

undefined

Also read: Omicron: షాకింగ్.. 59 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

మరోవైపు ముంబైలో 144 సెక్షన్ విధించడానికి రెండు కారణాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎంఐఎం పార్టీ ముంబైలో ర్యాలీ నిర్వహించాలని చూస్తుంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబైకి చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల అమరావతి, మాలెగావ్, నాందేడ్‌లలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. 

 మరోవైపు సంజయ్ రౌత్ ప్రకటనకు వ్యతిరేకంగా బీజేపీ కూడా నిరసనలు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, మరోవైపు ఒమిక్రాన్ కట్టడి కోసం డిసెంబర్ 11, 12 తేదీల్లో ముంబైలో 144 సెక్షన్ విధించారు.

click me!