కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దక్షిణాఫ్రికా, యూకే, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సహా చాలా దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వందకు చేరువ అవుతున్నాయి. డెల్టా కంటే వేగంగా వ్యాపించే వేరియంట్ కావడంతో మళ్లీ ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు విధించే అవకాశం ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఒక్క రోజే ఢిల్లీలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కరోనా(Coronavirus) మహమ్మారి కాస్త వెనుకంజ వేయడంతో అన్ని దేశాలు ఆంక్షలు(Restrictions) సడలించాయి. పాజిటివ్ కేసులు, కొత్త కేసు సంఖ్య తగ్గుతుండటంతో ఆంక్షలు సడలించి అంతర్జాతీయ ప్రయాణాలకు పచ్చ జెండా ఊపాయి. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి పంజా విసురుతుండటంతో మళ్లీ ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తప్పవనే అర్థమవుతున్నది. గతంలో కంటే వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ వేరియంట్ స్వల్ప సమయంలో చాప కింది నీరులా పాకుతున్నది. ఇప్పటికే వివిధ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. సరికొత్త కరోనా హాట్‌స్పాట్లు(Hotspots)గా మారుతున్నాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్(Omicron Variant) కేసులు క్రమంగా పెరుగుతూ వందకు చేరువవుతుండటంతో ఆంక్షలు విధించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు పండుగ సీజన్ ప్రారంభమవడం.. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల కదలికలు పెరగవచ్చు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశాలు దండిగా ఉంటాయి. అసలే ఒమిక్రాన్ వేరియంట్ మాటు వేసి ఉండటంతో ఈ ఫెస్టివల్ సీజన్ భయాలను వెంట తెస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సర వేడుకలు వస్తున్నందున బెంగళూరు నగరంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాలని ఓ నిపుణులు ప్యానెల్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. రెండు కేసులతో మొదలై అనతి కాలంలోనే వందకు చేరువవుతుండటంతో ఆంక్షలు తప్పవనే అభిప్రాయాలు వస్తున్నాయి.
undefined
Also Read: ఢిల్లీలో Omicron పంజా.. తాజాగా మరో పది కేసులు, మొత్తంగా 20కి చేరుకున్న పాజిటివ్ లు...
కరోనా కేసులు తగ్గిపోతున్నట్టే ఉండగా ఒక్కసారిగా యూకే, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలో గురువారం నాడు ముంబయి, ఢిల్లీల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ కేసుల పెరుగుదల ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన సమయంలోనే పెరుగుతున్నాయి. కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్‌లలో నిన్న ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా, పది కేసులు ఒక్క ఢిల్లీలోనే వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 9, ఢిల్లీలో 20, మహారాష్ట్రలో 32, రాజస్తాన్ లో 17, కేరళలో 5, గుజరాత్ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.
Also Read:
హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో 6,79,064కి చేరిన సంఖ్య
న్యూయార్క్‌లో బుధవారం నాడు ఒక్క రోజే 18,276 కొత్త కేసులు నమోదైనట్టు గురువారం వెల్లడించారు. జనవరి తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఇక్కడ రోజు అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. ఇదొక కొత్త హాట్‌స్పాట్‌గా మారే ముప్పు ఉన్నది. బ్రిటన్‌లో మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి అత్యధిక కేసులు గురువారం రిపోర్ట్ అయ్యాయి. బుధవారం కూడా అత్యధికంగా రిపోర్ట్(క్రితం రోజువి) కాగా, అంతకు సుమారు పది వేల కేసులు అధికంగా గురువారం 88,376 కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలోని అధిక జనాభా గల న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కారణంగానే నాలుగో వేవ్ పంజా విసురుతున్నది. ఇక్కడ డెల్టా కారణంగా థర్డ్ వేవ్ వచ్చినప్పుడు జులైలో గరిష్టంగా 26,485 కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఇక్కడ అంతకు మించి 26,976 కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోనూ కేసులు పెరుగుతున్నాయి.