Omicron Cases In India: భారత్‌లో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

Published : Dec 25, 2021, 11:51 AM ISTUpdated : Dec 25, 2021, 11:54 AM IST
Omicron Cases In India: భారత్‌లో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

సారాంశం

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల (Omicron Cases) సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసుల నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. అందులో 115 మంది కోలుకున్నట్టుగా (Recovered From Omicron) తెలిపింది. 

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్, యూఎస్‌లపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల (Omicron Cases) సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసుల నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. అందులో 115 మంది కోలుకున్నట్టుగా (Recovered From Omicron) తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా పేర్కొంది. ఆ తర్వాత 79 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకే ఇండియాలో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. 

ఇప్పటివరకు.. మహారాష్ట్ర‌లో 108, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్‌లో 22, హర్యానాలో 4 , ఒడిశాలో 4,  ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్మూ కాశ్మీర్‌లో 3 పశ్చిమ బెంగాల్‌లో 3, ఉత్తర ప్రదేశ్‌లో 2, చండీగఢ్, ఉత్తరాఖండ్, లడఖ్‌లలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రాలవారీగా కోలుకున్నవారు.. 
ఇప్పటివరకు.. మహారాష్ట్ర‌లో 42, ఢిల్లీలో 23, గుజరాత్‌లో 5, తెలంగాణలో 0, కేరళలో 1, తమిళనాడులో 0, కర్ణాటకలో 15, రాజస్థాన్‌లో 19, హర్యానాలో 2 , ఒడిశాలో 0,  ఆంధ్రప్రదేశ్‌లో 1, జమ్మూ కాశ్మీర్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 1, ఉత్తర ప్రదేశ్‌లో 2, చండీగఢ్‌లో 0, ఉత్తరాఖండ్‌లో 0 , లడఖ్‌‌లో 1 చొప్పున ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. 

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్రం చేసిన హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. కొన్ని రాష్ట్రాలు క్రిస్మస్, న్యూ ఈయర్ వేడుకలపై ఆంక్షలు విధించగా.. పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. 

Omicron: వ్యాక్సినేషన్ చాలదు! ప్రతి 10 ఒమిక్రాన్ కేసుల్లో 9 మంది పేషెంట్లకు రెండు డోసులు పూర్తి: కేంద్రం

ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..
గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. కొత్తగా 7,189 మందికి కరోనా నిర్దారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,79,815కి చేరింది. నిన్న కరోనాతో 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4,79,520కి చేరింది. తాజాగా 7,826 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,42,23,263కి చేరింది. ప్రస్తుతం దేశంలో 77,032 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. శుక్రవారం  66,09,113 వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,01,26,404కు చేరింది.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్