Omicron in India: దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే 1000 దాటిన కేసులు..

Published : Jan 09, 2022, 11:18 AM IST
Omicron in India: దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే 1000 దాటిన కేసులు..

సారాంశం

దేశంలో కరోనా కేసులతోపాటు (Corona Cases) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. 

దేశంలో కరోనా కేసులతోపాటు (Corona Cases) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.  భారత్‌లో ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,409 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వివరాలను వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 513 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో  ఉంది. 

ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో 1,009, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్తాన్ 373, కేరళలో 333, గుజరాత్‌లో 204, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113, ఒడిశాలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 28, పంజాబ్‌లో 27, పశ్చిమ బెంగాల్‌లో 27, గోవాలో 19, అస్సోంలో 9, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 8, మేఘలయాలో 4, అండమాన్ నికోబార్‌లో 3, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, పుదుచ్చేరిలో 1, చత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో ఇప్పటివరకు 439 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకన్నారు. తెలంగాణలో 47 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణంకాలు వెల్లడించాయి. 

భారత్‌లో ఒకే రోజు లక్షన్నర కేసులు.. 
భారత్‌లో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. నిన్న 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603కు చేరింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 5,90,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 6.77 శాతంగా ఉంది. మరోవైపు కరోనా రికవరీ రేటు.. 96.98 శాతంగా ఉంది. 

ఇక, భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం రోజులు దేశంలో 89,28,316 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 1,51,57,60,645కు చేరింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !