
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కొందరు దుండగులు కలిసి ఓ మహిళను చంపేశారు. డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని అనుకున్నారు. ఆ బాడీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లడానికి వారు ఓలా క్యాబ్‌ను బుక్ చేశారు. ఆ క్యాబ్ వారు ఉన్న చోటికి వచ్చింది. డెడ్ బాడీని ఓ సంచిలో క్యాబ్ డిక్కీలోకి ఎక్కించారు. కానీ, ఆ సంచి కొంచెం కదులుతూ ఉండటాన్ని, కొన్ని రక్తపు మరకలను ఆ క్యాబ్ డ్రైవర్ గుర్తించాడు. దీంతో తాను ఈ డ్రైవ్ చేయనని డ్రైవర్ తెగేసి చెప్పేశాడు. దీంతో వారు గొడవకు దిగారు. ఎలాగోలా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు తన అనుమానాలతో ఫిర్యాదు చేశాడు. ఆ మర్డర్ గుట్టు బయటపడింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కుసుమ్ అనే మహిళ హత్యకు గురైంది. రూ. 40 కోట్ల వారసత్వ ఆస్తి కోసం ఆమె మరిది, మరికొందరు బంధువులు కలిసి చంపేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.
కుసుమ్ మరిది, మరొక బంధువు ఇద్దరూ కలిసి నోయిడా నుంచి కాన్పూర్‌లోని మహారాజ్ పూర్‌కు జులై 11వ తేదీన ఓలా బుక్ చేశారు. కుసుమ్ డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని వారు ప్లాన్ వేసుకున్నారు. కానీ, ఓలా డ్రైవర్.. కారు డిక్కీలోకి సంచిలో కుక్కిన శవాన్ని ఎక్కిస్తుండగా అనుమానపడ్డాడు. ఆ సంచిలో కదలికలు కనిపించాయి. అంతేకాదు, కొన్ని చోట్ల రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. దీంతో తాను ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడు. దీంతో వారిద్దరూ ఆ డ్రైవర్ పైకి మండిపడ్డారు. దూషించారు. ఆ తర్వాత ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న ఓలా కారు డ్రైవర్ వెళ్లుతూ వెళ్లుతూ హైవేపై మోహరించిన పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అంతేకాదు, ఆయన మహారాజ్ పూర్ పోలీసులకూ సమాచారం చేరవేశాడు.
Also Read: ఏపీలో ఫేక్ లీడర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.. పూనమ్ కౌర్ మరో సంచలనం
కుసుమ్‌ను చంపడానికి సౌరభ్ ప్లాన్ వేసుకున్నాడు. ఆయన అనుచరుడికీ సమాచారం ఇచ్చాడు. అనుకున్నట్టే చంపేశారు. కానీ, బాడీని తరలిస్తుంగా ఓలా డ్రైవర్‌తో పట్టుబడ్డారు. పోలీసులు కుసుమ్ డెడ్ బాడీని ఫతేపూర్‌లో ఆదివారం కనుగొన్నారు. పోస్టుమార్టం కోసం పంపించారు.