14 ఏళ్ల బాలికపై 5,7,8 తరగతులు చదివే బాలుర సామూహిక అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి దారుణం..

Published : Jul 17, 2023, 04:56 PM ISTUpdated : Jul 17, 2023, 04:57 PM IST
14 ఏళ్ల బాలికపై 5,7,8 తరగతులు చదివే బాలుర సామూహిక అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి దారుణం..

సారాంశం

14 ఏళ్ల బాలికపై 5,7,8 తరగతులు చదివే ముగ్గురు బాలురు సామూహిక అత్యాచాారానికి పాల్పడ్డారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో చూసి, ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. 

ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు.  ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా 5,7,8 తరగతులు చదువుతున్న బాలురు కావడం శోఛనీయం.

రాజకీయ కుమ్ములాటలకు అతీతంగా వ్యవహరించండి - కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సుప్రీంకోర్టు ఆదేశం..

వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ లోని బొకారో పోలీసు స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక తన అక్కతో కలిసి నివిస్తోంది. అయితే ఇటీవల బాలిక అక్క ఇంట్లోలేని సమయంలో 5, 7, 8 తరగతులు ముగ్గురు బాలురు చొరబడ్డారు. ఆమెపై సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. కొంత సమయం తరువాత బాధితురాలు అక్క ఇంటికి తిరిగి వచ్చింది. 

ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా.. దయచేసి పాకిస్థాన్ కు తిరిగి వచ్చేయ్ - సీమా హైదర్ కు భర్త విజ్ఞప్తి

అయితే ఇంటికి వచ్చిన తరువాత తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించింది. కిటికీలో నుంచి చూడగా ముగ్గురు బాలురు తన సోదరిపై అత్యాచారానికి పాల్పడుతూ కనిపించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో ముగ్గురు బాలురు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రూ.90 వేల అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు మేనమామను హత్య.. ఆరు ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన మేనళ్లుడు..

దీంతో బొకారో పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా.. కుట్రలో భాగంగానే తమను ఇరికించారని నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు | PirPanjal Heavy Snowfall | Asianet News Telugu
First Day of 2026 at Sabarimala: నూతన సంవత్సరం శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ | Asianet News Telugu