స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి: బుక్కయిన కానిస్టేబుల్, ఉద్యోగం పోయే పరిస్ధితి

Siva Kodati |  
Published : May 25, 2020, 04:42 PM IST
స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి: బుక్కయిన కానిస్టేబుల్, ఉద్యోగం పోయే పరిస్ధితి

సారాంశం

అప్పుడప్పుడు ఎవరో చేసిన తప్పులకు ఇంకొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు

అప్పుడప్పుడు ఎవరో చేసిన తప్పులకు ఇంకొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన విజయ్ బ్రాహ్మణి స్థానికంగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయ్ స్నేహితురాలు ఒకామె అతని పోలీస్ డ్రెస్‌ను ధరించి టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు చేసి పోస్ట్ చేసింది.

Also Read:టిక్ టాక్ కలిపిన బంధం: తప్పిపోయిన బధిర తండ్రి పిల్లల దగ్గరకు

అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పై అధికారుల దృష్టిలో పడ్డాయి. వాటిలో అభ్యంతరకర దృశ్యాలు లేకపోయినా ఆ యువతి పోలీస్ యూనిఫాం వేసుకున్నందుకు గాను ఎస్పీ శివాజీ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే విజయ్‌ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం అతనిపై చర్యలు తీసుకుంటామని మరో అధికారి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Also Read:పిల్లికి చిత్ర హింసలు పెడుతూ టిక్ టాక్.. యువకుడు అరెస్ట్

కాగా, టిక్‌టాక్, వాట్సాప్‌, ట్విట్టర్‌లలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా చెప్పిన నాలుగు రోజులకే విజయ్ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu