విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలి: సుప్రీంకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published May 25, 2020, 4:11 PM IST
Highlights

విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని సుప్రీం కోర్టు ఎయిరిండియాను ఆదేశించింది. కరోనాను నిరోధించేందుకు భౌతిక దూరం తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టం చేసింది. 

న్యూఢిల్లీ:విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని సుప్రీం కోర్టు ఎయిరిండియాను ఆదేశించింది. కరోనాను నిరోధించేందుకు భౌతిక దూరం తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టం చేసింది. 

లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మే 7వ తేదీ నుండి రప్పిస్తున్నారు. వందే భారత్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 

also read:ఢిల్లీలోనే 82 ఫ్లైట్స్ క్యాన్సిల్: ఆందోళనలో ప్రయాణీకులు

ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లో ఉన్న వారిని రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరం మనిషికి మధ్య ఉండాలని సూచిస్తున్నారు. కానీ, విమానాల్లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

విమానాల్లో మధ్య సీట్లు వదిలేయడం కంటే క్వారంటైన్ , టెస్టింగ్ అత్యుత్తమ విధానాలను నిపుణులు చెప్పారని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. అయితే ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. విమాన ప్రయాణీకులకు వైరస్ సోకదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది కోర్టు. 

ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుండి జరిగే విమాన టిక్కెట్ల బుకింగ్స్ లో  మధ్య సీటు ఖాళీగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. కావాల‌నుకుంటే దేశీయ విమానాల్లోనూ ఈ స‌మ‌స్య గురిచి హైకోర్టులు జూన్ 2న విచారించ‌వచ్చ‌ని న్యాయ‌స్థానం సూచించింది. 

కాగా నేటి నుంచి దేశీయ విమాన‌యానం పునఃప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌ర్వీసుల‌ను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇప్ప‌టికే కరోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నందున అవి మ‌రింత విజృంభించే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నాయి.
 

click me!