రిక్షా కార్మికుడికి కోటి రూపాయాల విరాళం: ఒడిశా మహిళ ఉదారత

By narsimha lodeFirst Published Nov 14, 2021, 9:36 AM IST
Highlights

ఎలాంటి సంబంధం లేకున్నా తన కుటుంబానికి నిస్వార్ధ:గా సేవ చేసిన రిక్షా కార్మికుడు సామల్ కుటుంబానికి వినతి పట్నాయక్ అనే మహిళ కోటి రూపాయాల ఆస్తిని ఇచ్చింది. 


భువనేశ్వర్: ఓ రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ మహిళ కోటి రూపాయాల ఆస్తిని ఇచ్చింది.  ఈ మేరకు ఆస్తి పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది.  ఒడిశా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది.ఒడిశా రాష్ట్రంలోని కటక్ సమీపంలో సంబల్‌పూర్‌కు చెందిన మినతి పట్నాయక్ భర్తతో కలిసి సుతాహత్ క్రిస్టియన్ సాహిలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఒక కూతురు ఉంది.  అయితే ఆమెను విషాదం వెంటాడింది.  అనారోగ్యానికిి గురై మినతి పట్నాయక్  భర్త 2020 జూలై మాసంలో మరణించాడు. కూతురికి పెళ్లి చేద్దామనుకొని పెళ్లి సామాగ్రిని సిద్దం చేసిన సమయంలో భర్త మరణించడంతో ఆమె కుంగిపోయింది. ఆ తర్వాత ఆమె ఇంట్లో మరో విషాదం చోటు చేసుకొంది. 2021లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కగానొక్క కూతురు మరణించింది. దీంతో ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. 

భర్త మరణించడం, కూతురు  అగ్ని ప్రమాదంలో సజీవ దహనం కావడంతో ఆస్తి కోసం అన్నదమ్ములు, బంధువులు ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆమె ఇంటికి సమీపంలోనే రిక్షా కార్మికుడు Budha Samal నివసిస్తున్నాడు. ఈ కుటుంబానికి సామల్ కుటుంబం తోడుగా ఉంటుంది. అయితే తనకు ఇంతకాలం పాటు ఎలాంటి స్వార్ధం లేకుండా సేవ చేస్తున్న బుడ సామల్ కుటుంబానికి తన ఆస్తిని రాసివ్వాలని Minati Patnaik నిర్ణయం తీసుకొంది.  వెంటనే ఈ మేరకు వీలూనామా రాయించి  రిజిస్ట్రేషన్ చేయించింది. 

also read:రిక్షా డ్రైవర్ కి ఐటీ నోటీసులు.. రూ.3కోట్లు చెల్లించాలంటూ..!

తన కూతురిని చిన్నతనంలో స్కూల్ కు తీసుకెళ్లడంతో పాటు ప్రతి రోజూ కూరగాయలు, నిత్యావసర సరుకులు తెచ్చి ఇచ్చేవాడని ఆమె గుర్తు చేసుకొన్నారు. అంతేకాదు తన భర్త అనారోగ్యంగా ఉన్న సమయంలో బంధువులు, తోబుట్టువులు దగ్గర లేకున్నా రిక్షా కార్మికుడు సామల్ తన కుటుంబానికి సహాయం చేశాడని ఆమె మీడియాకు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తన మూడంతస్థుల భవనం, ఇతర సామాగ్రిని అతడికి రాసి ఇచ్చింది.తమ కుటుంబానికి చేసిన సేవలకు గాను సామల్ కుటుంబానికి తన ఆస్తిని రాసి ఇచ్చినట్టుగా మినతి పట్నాయక్ తెలిపారు.తనతోనే సామల్ కుటుంబం ఉందని ఆమె తెలిపారు.

రిక్షా కార్మికుడు సామేల్ కుటుంబానికి ఆస్తిని రాసివ్వడాన్ని  మినతి పట్నాయక్  సోదరీమణులు తీవ్రంగా వ్యతిరేకించారు. తన కూతురు చనిపోయిన సమయంలో ఎవరూ కూడా తనకు ఫోన్ చేసి పరామర్శించలేదన్నారు. తాను ఫోన్ చేసినా కూడ ఎవరూ కూడా స్పందించలేదని ఆమె తెలిపారు. 25 ఏళ్లుగా తనకు సామేల్ కుటుంబం తనకు అండగా నిలిచిందని ఆమె చెప్పారు.తన కూతురు స్కూల్, కాలేజీకి వెళ్లిన సమయంలో కూడా సామేల్ కంటికి రెప్పలా కాపాడారని ఆమె తెలిపారు. సామేల్ కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ గౌరవించారని చెప్పారు. అంతే కాదు తమ కుటుంబంలో ఎవరి ఏ ఇబ్బంది వచ్చినా కూడా జాగ్రత్తగా చూసుకొనేవారని మినతి పట్నాయక్ తెలిపారు.

తాను ఏనాడూ కూడా ఆస్తి గురించి పట్టించుకోలేదని రిక్షా కార్మికుడు సామేల్ తెలిపారు.  మినతి పట్నాయక్ భర్త చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఒక సభ్యురాలిని మినతిని చూసుకొన్నామన్నారు. ఆమె బతికే వరకు తాము ఆమెను చూసుకొంటామని సామేల్ తెలిపారు.


 


 

click me!