క్రిప్టో‌కరెన్సీపై ఏం చేద్దాం: ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం

By Siva KodatiFirst Published Nov 13, 2021, 10:27 PM IST
Highlights

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో ఇన్వెస్ట్‌‌కు సంబంధించి మార్గదర్శకాలపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ (cryptocurrency) లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్‌ వేదికగా జరిగే ఈ వ్యవహరంలో ఎవరి జోక్యం లేకుండా పోయింది. క్రిప్టోలో పెట్టుబడులు మంచిది కాదనే ప్రచారం జరుగుతున్నా.. లావాదేవీలు మాత్రం ఆగడం లేదు. మార్కెట్‌లో బిగ్‌ప్లేయర్లు, ప్రభుత్వాల జోక్యం లేకుండా పూర్తిగా బ్లాక్‌ చెయిన్‌ (black chain)టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. మార్కెట్‌ను ఎవరూ కృత్రిమంగా ప్రభావితం చేయలేకపోవడం ఇందులో సానుకూల అంశం. 

అయితే సైబర్‌ దాడుల (cyber attacks) ముప్పు ఎక్కువ. అంతేకాదు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అందువల్ల గతంలో సుప్రీంకోర్టు (supreme court) సైతం క్రిప్టోపై నిషేధం విధించింది. చైనాతో సహా పలు దేశాలు క్రిప్టో లావాదేవీలను ప్రోత్సహించడం లేదు. దీంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో ఇన్వెస్ట్‌‌కు సంబంధించి మార్గదర్శకాలపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.

ALso Read:మీరు క్రిప్టో కరెన్సీ నుండి డబ్బు సంపాదిస్తున్నారా.. అయితే ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలుసుకోండి

ఇప్పటికే ఆర్‌బీఐ (rbi) , హోం, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు క్రిప్టోపై విస్తృతమైన కసరత్తు చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సంప్రదించినందున ప్రధాని సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా పారదర్శకత లేని ప్రకటనల  ద్వారా యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఆపాలని ప్రధాని భావిస్తున్నారు. క్రమబద్ధీకరించని క్రిప్టో మార్కెట్‌లు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌లకు మార్గాలుగా మారకుండా చేయడంపై చర్చించారు. ప్రభుత్వం ఈ రంగంలో తీసుకోనున్న చర్యలు ప్రగతిశీలంగా ముందుకు సాగాలని సమావేశంలో ఆకాంక్షించారు. క్రిప్టోకు సరిహద్దులు లేనందున .. ప్రపంచ దేశాల భాగస్వామ్యం, సామూహిక వ్యూహాలు అవసరమని సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. 

క్రిప్టోకరెన్సీపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీ (bjp) అధికారంలో ఉన్న కర్ణాటకలో బిట్‌‌కాయిన్‌ కుంభకోణం (karnataka bitcoin scam) రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బిట్‌కాయిన్‌ కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్‌ (congress) పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టును కోరుతోంది. మరోవైపు బిట్‌కాయిన్‌ వివాదం రోజురోజుకి ముదరడంతో కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై (basavaraj bommai) , మాజీ సీఎం యడ్యూరప్పలతో (yediyurappa ) పాటు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ నళీని కుమార్‌లు అత్యవసర సమావేశం నిర్వహించారు.

click me!