భువనేశ్వర్ లో శిశువు జననం... ఫణిగా నామకరణం

By telugu teamFirst Published May 3, 2019, 3:49 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫణి తుపాను శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫణి తుపాను శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. కాగా... ఒడిశా, ఉత్తరాంధ్రలో ఈ తుఫాను ప్రభావం భారీగా చూపిస్తోంది. భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ రోజు ఉదయం భువనేశ్వర్ లో ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

భువనేశ్వర్ కి చెందిన మహిళ రైల్వేలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ రోజు ఉదయం ఆమెకు పురిటి నొప్పులు  రావడంతో రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ఆడ శిశువు జన్మించింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఫణి తుఫాను ఒడిశాను కుదిపేస్తున్న నేపథ్యంలో... తుఫాను సమయంలో పుట్టినందుకు గాను ఆ చిన్నారిని ఫణి అని నామకరణం చేయడం విశేషం. 

Bhubaneswar: A 32-year-old woman gave birth to a baby girl in Railway Hospital today at 11:03 AM. Baby has been named after the cyclonic storm, Fani. The woman is a railway employee, working as a helper at Coach Repair Workshop, Mancheswar. Both the mother&child are fine. pic.twitter.com/xHGTkFPlAe

— ANI (@ANI)

 

click me!