ఫణి తుఫాను ఎఫెక్ట్... కోల్ కత్తా ఎయిర్ పోర్టు మూసివేత

By telugu teamFirst Published May 3, 2019, 3:21 PM IST
Highlights

ఫణి తుఫాను తీరం దాటింది. దీంతో... ఈ తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా..ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఫణి తుఫాను తీరం దాటింది. దీంతో... ఈ తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా..ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో  కోల్ కతా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. డీజీసీఏ( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆదేశాల మేరకు ఎయిర్ పోర్టును మూసివేశారు. నేటి నుంచి శనివారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు కోల్ కతా విమానాశ్రయం నుంచి  ఒక్క విమానం కూడా ముందుకు కదలదని అధికారులు చెప్పారు. పూర్తిగా విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత శుక్రవారం రాత్రి 9గంటల 30నిమిషాల నుంచి శనివారం సాయంత్రం 6గంటల వరకు ఎయిర్ పోర్టు మూసివేస్తున్నట్లు చెప్పారు. తర్వాత టైమింగ్స్ మార్చినట్లు మరో ప్రకటనలో తెలిపారు.

click me!