కోరమండల్ రైలు ప్రమాద బాధ్యుల్ని శిక్షిస్తాం:కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

By narsimha lodeFirst Published Jun 4, 2023, 2:52 PM IST
Highlights


బాలాసోర్ లో రైలు  ప్రమాదానికి  కారణమైన వారిని కఠినంగా  శిక్షిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  చెప్పారు. 

న్యూఢిల్లీ: ఒడిశా  రాష్ట్రంలోని బాలాసోర్ లో  జరిగిన  రైలు ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  చెప్పారు. 

ఒడిశాలోని  కోరమాండల్ లో  జరిగిన  రైలు ప్రమాదంలో  గాయపడిన వారిని  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ఆదివారంనాడు  పరామర్శించారు.  ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో  మాట్లాడారు. 

శుక్రవారంనాడు  రాత్రి  బాలాసోర్ వద్ద  కోరమండల్  ఎక్స్ ప్రెస్ ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  280కిపైగా మృతి చెందారు. 800కి పైగా మంది గాయపడ్డారు. గాయపడినవారు  పలు ఆసుపత్రుల్లో  చికిత్స పొందుతున్నారు. రైలు  ప్రమాదంతో  దెబ్బతిన్న  ట్రాక్ పునరుద్దరణతో పాటు   సాధారణస్థితిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టినట్టుగా   మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  చెప్పారు. రైల్వే  ప్రమాదానికి  గల కారణాలను అన్వేషిస్తున్నామని  మంత్రి  చెప్పారు. ఈ ప్రమాదానికి  గల కారణమైన  బాధ్యులలను కఠినంగా   శిక్షిస్తామన్నారు.
దెబ్బతిన్న  రైల్వే ట్రాక్ ను  బుధవారంనాటికి పునరుద్దరిస్తామని  రైల్వే  శాఖ   మంత్రి  ఆశ్విన్ వైష్ణవ్  చెప్పారు. 

also read:అత్యధిక రైలు ప్రమాదాలు: నితీష్ కుమార్ హయంలోనే

ఒడిశా  రైలు  ప్రమాదంతో  పలు  రైళ్లు రద్దయ్యాయి.  శుక్రవారంనాడు  ఒడిశాలోని  బాలాసోర్ లో  కోరమండల్  రైలు ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  288కిపైగా మృతి చెందారు.  ఇంకా 190 మంది  మృతదేహలను గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాదంలో  ఏపీ రాష్ట్రానికి  చెందిన  12 మంది ఆచూకీ   వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ ప్రమాదంలో ఏపీకి  చెందినవారిలో  20 మంది గాయపడ్డారు.  వీరిలో  11 మంది పలు ఆసుపత్రుల్లో  చికిత్స  పొందుతున్నారు. 

click me!