అత్యధిక రైలు ప్రమాదాలు: నితీష్ కుమార్ హయంలోనే

By narsimha lodeFirst Published Jun 4, 2023, 2:48 PM IST
Highlights

నితీష్ కుమార్  రైల్వే మంత్రిగా  ఉన్న సమయంలో  దేశంలో  ఎక్కువ రైలు ప్రమాదాలు  జరిగాయి.  ఈ సమయంలోనే  ఎక్కువ మంది మృతి చెందారు. 

న్యూఢిల్లీ:  1995-95లో  దేశంలో  అత్యధిక రైలు ప్రమాదాలు  చోటు  చేసుకున్నాయి . రైళ్లు  ఒకదానికొకటి ఢీకొనడం,  పట్టాలు తప్పిన ఘటనలు  ఎక్కువగా  నమోదయ్యాయి.   కేంద్ర  రైల్వే శాఖ మంత్రిగా  నితీష్ కుమార్  ఉన్న సమయంలో  రైల్వే  ప్రమాదాలు ఎక్కువగా  చోటు  చేసుకున్నాయి. 79 రైళ్లు ఢీకొన్న ఘటనలు నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా  ఉన్న సమయంలో జరిగాయి.  1000 రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు  చోటు  చేసుకున్నాయి.  మమత  బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా  ఉన్న సమయంలో  79 రైళ్లు ఢీకొన్న ఘటనలు నమోదయ్యాయి. .  839  పట్టాలు తప్పిన  ఘటనలు రికార్డయ్యాయి. 

లాలూప్రసాద్  యాదవ్  రైల్వే మంత్రిగా  ఉన్న సమయంలో  51 రైళ్లు ఢీకన్న  ఘటనలు  చోటు  చేసుకున్నాయి.  550  పట్టాలు తప్పిన  కేసులు నమోదయ్యాయి. మమత  బెనర్జీ  మంత్రిగా  ఉన్న సమయంలో  జరిగిన రైలు ప్రమాదాల్లో  1451 మంది మృతి చెందారు.  నితీష్ కుమార్  మంత్రిగా  ఉన్న కాలంలో 1527 మంది  చనిపోయారు.  లాలూ ప్రసాద్  యాదవ్  మంత్రిగా  ఉన్న  సమయంలో జరిగిన ప్రమాదాల్లో   1159 మంది  చనిపోయారు. 


1995-96 లో 29 రైళ్లు ఢీకొన్న ఘటనలు  చోటు చేసుకున్నాయి. 296 రైళ్లు పట్టాలు తప్పిన  ఘటనలు  నమోదయ్యాయి. 2020-21లో  కేవలం  ఒకే  ఒక్క   రైలు ఢీకొన్న ప్రమాదం  నమోదైంది.  అదే సంవత్సరంలో  17  రైళ్లు పట్టాలు తప్పిన  ఘటనలు  చోటు  చేసుకున్నాయి. 

1997-98లో 35  రైళ్లు ఢీకొన్న  ప్రమాదాలు  నమోదయ్యాయి.  అదే ఏడాదిలో 289 రైళ్లు పట్టాలు తప్పిన  ఘటనలు రికార్డయ్యాయి. 2000-01లో 350  రైళ్లు పట్టాలు తప్పినట్టుగా  రైల్వే శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అదే ఏడాది  29 రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలు  నమోదయ్యాయి. 1999-2000లలో జరిగిన రైలు ప్రమాదాల్లో  616 మంది మృతి చెందారు. ఇప్పటివరకు  జరిగిన  ప్రమాదాల్లో  అత్యధికంగా  1121 మంది గాయపడిన  సంఖ్య కూడ  1999-2000లలోనే  రికార్డైంది.

also read:కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ప్రమాదానికి గురైంది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ

1920-21 లో జరిగిన  రైలు  ప్రమాదాల్లో  కేవలం  22 మంది  మాత్రమే  మృతి చెందారు.ఈ ఏడాది ఇప్పటివరకు  ఆరు రైళ్లు డీకొన్న ప్రమాదాలు  నమోదయ్యాయి. మరో వైపు  36 రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు నమోదయ్యాయి. 



 

click me!