కోరమండల్ ట్రైన్ లో 120మంది తెలుగు వారు.. 237కు చేరిన మృతుల సంఖ్య..

By SumaBala BukkaFirst Published Jun 3, 2023, 9:05 AM IST
Highlights

ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ట్రైన్ లో 120మంది తెలుగు  ప్రయాణికులు ఉన్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఆరు స్టాపులున్నాయి. 

ఒడిశా : ఒడిశా రైలు ప్రమాద ఘటన మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఆరు స్టేషన్లు ఉన్నాయి. విశాఖపట్రం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తెనాలి, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లు ఉన్నాయి. 

రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, బాపట్ల, తెనాలి, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంటలకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 120మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. అయితే వీరితో ఎంతమంది ప్రమాదానికి గురయ్యారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. 

ఒడిశా రైలు ప్రమాదం : రాష్ట్రపతి, ప్రధాని దిగ్భాంత్రి.. హెల్ప్ లైన్లు ఏర్పాటు..

మృతుల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. ఈ ప్రమాద మృతుల సంఖ్య 237కి చేరుకుంది. 900 కు పైగా క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగి 12 గంటలు గడుస్తున్నా ఇంకా పూర్తిగా ప్రయాణికులు బయటకు రాలేదు.  ఇంకా భోగీల్లో చిక్కుకున్నవారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో అధికారులు చెప్పలేకపోతున్నారు.  భోగీలు నుజ్జునుజ్జవ్వడంతో వెలికి తీయడంతో సమయం పడుతోంది. మృతుల వివరాలను రైల్వే శాఖ ఇంకా వెల్లడించలేదు. 

రైలు ప్రమాదంలో సహాయక చర్యలు అందించడానికి సైన్యం రంగంలోకి దిగింది.  కోల్ కతా నుంచి అదనపు బలగాలు చేరుకున్నాయి. ఎయిర్ ఫోర్స్ కూడా సహాయక చర్యలకు సాయపడుతోంది. 

click me!