Train Accident ; 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా సడన్ బ్రేక్... ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం 

By Arun Kumar P  |  First Published Nov 12, 2023, 10:09 AM IST

130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలు సడన్ ఆగడంతో ఏర్పడ్డ భారీ కుదుపులకు ఇద్దరు ప్రమాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 


ఒడిషా : ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఒడిషాలో మారణహోమం సృష్టించిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదాన్ని మరిచిపోకముందే మరో ప్రమాదం చోటుకుంది. ఎలాంటి ప్రమాదం జరక్కూడదని లోకో పైలట్ తీసుకున్న జాగ్రత్త చర్యలు ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నాయి. 

రైల్వే అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిషా రాష్ట్రంలోని పూరి నుండి దేశ రాజధాని న్యూడిల్లీకి పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులతో బయలుదేరింది.  ఈ రైలు 130 కిలోమీటర్ల వేగంతో జార్ఖండ్ మీదుగా ప్రయాణిస్తుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలవెంట వుండే విద్యుత్ తీగలు ఒక్కసారిగా రైలుపై తెగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్  ఎలాంటి ప్రమాదం జరక్కుండా వెంటనే రైలును నిలిపివేసాడు. 

Latest Videos

undefined

130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలు సడన్ ఆగడంతో భారీ కుదుపులు ఏర్పాడ్డాయి. దీంతో ఇద్దరు ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా మృతిచెందారు. అలాగే చాలామంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని ముందుగా గాయపడిన ప్రయాణికులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Read More  తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి, 60 మందికి గాయాలు...

ఈ ఘటన కొడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. పట్టాలపై రైలు నిలిచిపోవడంతో ఇతర రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో రైలును డీజిల్ ఇంజన్ సాయంతో దగ్గర్లోని రైల్వేస్టేషన్ కు తరలించారు. అక్కడినుండి మరో ఎలక్ట్రిక్ ఇంజన్ ను జతచేసి ప్రమాణికులను డిల్లీకి తరలించారు. 
 

click me!