వామ్మో.. కేసు ట్రయల్స్ నెమ్మదిగా సాగుతోందని మహిళ జడ్జిని కత్తితో బెదిరించిన ఒడిషా వాసి..

By team teluguFirst Published Nov 29, 2022, 1:02 PM IST
Highlights

కేసు ట్రయిల్స్ మళ్లీ వాయిదా వేశారని ఆగ్రహించిన ఓ నిందితుడు మహిళా జడ్జిపై దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఒడిషాలో జరిగింది. అతడిపై పోలీసులు మరో కేసు నమోదు చేేశారు. 

కేసు ట్రయల్స్ నెమ్మదిగా సాగుతోందని ఆగ్రహించిన ఓ వ్యక్తి ఏకంగా జడ్జినే కత్తితో బెదిరించాడు.  హఠాత్పరిణామానికి ఆ మహిళా జడ్పి ఒక్క సారిగా కంగారు పడ్డారు. అతడి బారి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. బెర్హంపూర్ నగరానికి చెందిన 51 ఏళ్ల భగబన్ సాహుపై గతంలో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే ఆ కేసులకు సంబంధించి ఆయన సోమవారం బెర్హంపూర్లోని రద్దీగా ఉన్న కోర్టు గదికి వచ్చాడు. అయితే తన పనిలో నిమగ్నమై ఉన్న సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎస్డిజెఎం) ప్రాంగ్యా పరమిత పరిహరి వద్దకు వెళ్లి కత్తితో బెదిరించాడు. దీంతో అక్కడే ఉన్న న్యాయవాదులు అతడిని వారించడంతో ఆమె అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు.

ఎట్టకేలకు చిక్కిన టూత్‌పేస్ట్‌ దొంగ.. 23,400 టూత్‌పేస్టులు స్వాధీనం..

దీనిపై బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ ఎం మాట్లాడుతూ...‘‘ఈ ఘటన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జరిగింది. న్యాయమూర్తి న్యాయస్థానంలో పేపర్ వర్క్ లో బిజీగా ఉన్నారు. సాహు నేరుగా ఆమె బెంచ్ వద్దకు వెళ్లి, కత్తితో దాడి చేసి, ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆ సమయంలో న్యాయవాదులతో పాటు సుమారు 20 మంది కోర్టు హాలులో ఉన్నారు. అక్కడున్న సిబ్బంది, న్యాయవాదులు వెంటనే ఆమెను రక్షించారు.’’ అని తెలిపారు. న్యాయమూర్తి క్షేమంగా ఉన్నారని, నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు.  న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదుల భద్రత కోసం గంజాం జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాలు, సెషన్స్ కోర్టు ఆవరణలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తామని బెర్హంపూర్ ఎస్పీ తెలిపారు.

దారుణం.. కిడ్నాప్ అయిన బాలిక బీచ్ లో మృతదేహంగా లభ్యం.. అత్యాచారం చేసి, చంపేశారని తల్లిదండ్రుల అనుమానం..

2020లో మహిళలపై దోపిడీ, దాడి, హత్యాయత్నం, దుష్ప్రవర్తన కేసులో సాహును గతంలో అరెస్టు చేశారని  ఇన్స్పెక్టర్ జనరల్ (దక్షిణ శ్రేణి) సత్యబ్రత భోయ్ తెలిపారు. అయితే పాత కేసులలో ఒకదానికి సంబంధించి సోమవారం కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ దాడి విషయంలో నిందితుడిని ప్రశ్నించినప్పుడు అతడి విచారణ తేదీని వాయిదా వేసినట్లు ఎవరో అతడికి చెప్పారని అన్నారు. దీంతో నిందితుడికి కోపం వచ్చి, న్యాయమూర్తిపై దాడికి యత్నించి ఉండవచ్చని తెలిపారు. అతడిపై ఈ ఘటనలో మరో కొత్త కేసు నమోదు చేశామని అన్నారు.

మితిమీరుతోన్న పాక్ ఉగ్రచర్యలు.. మరోసారి పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ న్యాయవాది మాట్లాడుతూ.. నిందితుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారని ఎవరూ ఊహించలేదని అన్నారు. ‘‘ మేము కోర్టు గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా న్యాయమూర్తి అరుపులు విన్నాము. ఓ వ్యక్తి దగ్గర కత్తి ఉండటం చూసి షాక్ అయ్యాము. అతడు కోర్టులోకి ఆయుధాలను తీసుకొచ్చాడంటే ఇక్కడ భద్రతా చర్యలు సరిగా లేవని అర్థమవుతోంది’’ అని అన్నారు. కాగా.. సాహు కేసును ఎవరూ చేపట్టవద్దని గంజాం బార్ అసోసియేషన్ న్యాయవాదులను కోరింది.

click me!