లవ్ చేశాడు.. పెళ్లి చేసుకోమంటున్నదని చంపేశాడు.. 49 సార్లు కత్తితో పొడిచి దారుణ హత్య

Published : Dec 15, 2022, 01:41 PM IST
లవ్ చేశాడు.. పెళ్లి చేసుకోమంటున్నదని చంపేశాడు.. 49 సార్లు కత్తితో పొడిచి దారుణ హత్య

సారాంశం

ఒడిశాకు చెందిన ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయినే దారుణంగా చంపేశాడు. పెళ్లి చేసుకోమంటున్నదని 49 సార్లు కత్తితో పొడిచి చంపేసిన ఘటన చోటుచేసుకుంది.  

న్యూఢిల్లీ: ప్రేమించాడు.. కానీ, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రేయసేమో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెడుతున్నది. అందుకే ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దారుణంగా హతమార్చాడు. 49 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని నిర్దారించుకున్నాక డెడ్ బాడీని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. 

కసాయిని ప్రేమించిన ఒడిశాకు చెందిన యువతి కునీదాస్ సీమాదాస్ ప్రాణాలనే పోగొట్టుకుంది. జగన్నాథ్ గోడా అనే యువకుడిని ప్రాణంగా ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని కోరడమే ప్రాణాల మీదికి తెస్తుందని, అదీ తాను ఇష్టపడ్డ యువకుడే కసాయిగా మారుతాడని ఆమె ఊహించలేదు. 

కునీదాస్ సీమాదాస్‌ను జగన్నాథ్ గోడా నమ్మించి క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లాడు. గుజరాత్‌లోని సూరత్ నగరాన్ని చుట్టేసి వద్దామని ఆమెను నమ్మించి అతనితో వెంట తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను 49 సార్లు అంటే.. సీమాదాస్ మరణించిందని నిర్ధారించుకునే దాకా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని వదిలి తిరిగి భువనేశ్వర్ వచ్చేశాడు. 

Also Read: భార్య వేధింపులు...పెళ్లైన మూడునెలలకే కొత్తపెళ్లికొడుకు ఆత్మహత్య..

సూరత్ పోలీసుల దృష్టికి ఆ డెడ్ బాడీ వచ్చింది. ఆ యువతి ధరించిన టీ షర్ట్ కేసు ఛేదించడంలో కీలకంగా మారింది. వారు ఆ టీ షర్ట్‌ ఆధారంగా నగరంలో సీసీటీవీ క్యామెరాల ఫుటేజీలను పరిశీలించారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ఎంక్వైరీ చేశారు. చివరకు వారు ఒడిశా నుంచి అక్కడికి వచ్చినట్టు గుర్తించారు.

అనంతరం, ఐపీసీలోని సెక్షన్ 302 కింద నిందితుడిని భువనేశ్వర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. ఈ హత్యలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నదా? అనే కోణంలోనూ విచారణ జరుగుతున్నది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu