భార్య చనిపోయిందని.. ఆమె చితిలోకి దూకిన భర్త..!

Published : Aug 26, 2021, 07:42 AM IST
భార్య చనిపోయిందని.. ఆమె చితిలోకి దూకిన భర్త..!

సారాంశం

అందరితోపాటే ఇంటికి బయలు దేరిన నీలమణి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్లి.. భార్య చితి మంటల్లో దూకేశాడు. 


వారిది అన్యోన్య దాంపత్యం. ఇన్ని సంవత్సరాలు ఇద్దరూ కలిసే ఆనందాన్ని పంచుకున్నారు.. కష్టాలను దాటుకుంటూ వచ్చారు. అనుకోకుండా భార్య  చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు. తమ మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య చితిలో దూకేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమతిలోని శైలు జోడి గ్రామానికి చెందిన రాయబారి(60), నీలమణి శబర(65) భార్యభర్తలు. రాయబారి మంగళవారం గుండెపోటుతో మరణించింది. నలుగురు కుమారులు, భర్త ఆమె మృతదేహాన్ని గ్రామస్థుల సహాయంతో గ్రామ శివారుల్లోని స్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ చితి పేర్చి మృతదేహానికి నిప్పు అ ంటించి.. అందరూ ఇళ్లకు బయలుదేరారు.

అందరితోపాటే ఇంటికి బయలు దేరిన నీలమణి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్లి.. భార్య చితి మంటల్లో దూకేశాడు. అందరూ చూస్తుండగానే.. భార్యభర్తలు ఇద్దరూ ఒకే చితిలో కాలిపోయారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు