రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం, గుడిసెకి మంటలు.. పైలట్ సురక్షితం

Siva Kodati |  
Published : Aug 25, 2021, 09:17 PM IST
రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం, గుడిసెకి మంటలు.. పైలట్ సురక్షితం

సారాంశం

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధవిమానం రాజస్థా‌న్‌లోని బర్మార్ వద్ద కుప్పకూలింది. బుధవారం సాయంత్రం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధవిమానం రాజస్థా‌న్‌లోని బర్మార్ వద్ద కుప్పకూలింది. బుధవారం సాయంత్రం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సాయంత్రం 5.30 గంటలకు శిక్షణలో భాగంగా విమానం గాల్లోకి లేవగా, టేకాఫ్ అనంతరం సాంకేతికలోపం తలెత్తినట్టు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ విమానం ఓ గ్రామ శివారు ప్రాంతంలో కూలిపోవడంతో ఓ గుడిసెకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంపై భారత వాయుసేన శాఖాపరమైన విచారణకు ఆదేశించింది

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result