ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నంబాదాస్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు.
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా దాస్ పై ఆదివారం నాడు ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఝర్పుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్్ సమీపంలోని గాంధీ చాక్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. నబాదాస్ ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం దిగిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు దిగారు.
కాల్పుల ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తులు ధర్నాకు దిగారు. దీంతో ఘటన జరిగిన ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రిపై ముగ్గురు దుండగులు కాల్పులకు దిగినట్టుగా సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన మంత్రిని జార్సుగూడ ఆసుపత్రికి తరలించారు. మంత్రిపై ముగ్గురు దుండగులు కాల్పులకు దిగినట్టుగా సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన మంత్రిని జార్సుగూడ ఆసుపత్రికి తరలించారు. బ్రజరాజ్ నగర్ లోని బీజేపీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించాల్సి ఉంది. కారు నుండి మంత్రి దిగిన వెంటనే దుండగులు కాల్పులకు దిగారు. పథకం ప్రకారంగానే దుంగులు మంత్రిపై కాల్పులకు దిగారని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
కాల్పులకు దిగింది ఓ ఎఎస్ఐ గా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుపుతారని సీనియర్ బీజేడీ నాయకుడు ప్రసన్న ఆచార్య చెప్పారు. నబాదాస్ మహారాష్ట్రలోని ఓ ఆలయంలో కోటి రూపాయాల విలువైన బంగారాన్ని ఇటీవలనే విరాళంగా ఇచ్చారు.