రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్టూడెంట్ యూనియన్ లీడర్‌తో సహా ముగ్గురు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు..

By Sumanth Kanukula  |  First Published Jan 29, 2023, 10:53 AM IST

రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును మరో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 


రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును మరో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున జలోర్‌-అహోర్‌ రహదారిపై కనివాడ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో వీర్ వీరాందేవ్ ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కలుసింగ్ భాటి‌తో పాటు రణ్ సింగ్, కమలేష్ చౌదరి ఉన్నట్టుగా గుర్తించారు. 

అహోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిచెందినవారు మరో నలుగురితో కలిసి వాహనంలో వెళ్తుండగా కనివాడ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ వాహనం ఢీకొట్టింది. ఇక, గాయపడిన నలుగురు అజిత్ సింగ్, గౌరవ్ ప్రజాపత్‌‌లుగా గుర్తించగా.. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Latest Videos

click me!