భారత్‌లో మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్ పట్నాయక్ .. రేవంత్, జగన్‌ల స్థానమెక్కడ..?

By Siva Kodati  |  First Published Feb 18, 2024, 4:08 PM IST

దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టించారు. 


దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ విషయం తేలింది. నవీన్‌కు 52.7 శాతం ఓట్లు రాగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 51.3 శాతం రేటింగ్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఇక 48.6 శాతం ఓట్లతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మూడో స్థానంలో , గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు 42.6 నాలుగవ స్థానం దక్కించుకున్నారు. 

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 41.4 శాతం ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ (41.1 శాతం) ఆరో స్థానంలో, ఉత్తరప్రదేశ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (40.1 శాతం) ఓట్లతో ఏడో స్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ 8వ స్థానంలో నిలిచారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 35.8 శాతం ఓట్లతో 9వ స్థానంలో, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. 

Latest Videos

కాగా.. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. మనదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట వుంది. 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 27 వరకు దాదాపు 24 ఏళ్లకు పైగా ఆయన సీఎంగా విధులు నిర్వర్తించారు. నవీన్ పట్నాయక్.. 2000 మార్చి 5న తొలిసారిగా ఒడిషా ముఖ్యమంత్రి అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ విజయం సాధించి పట్నాయక్ మరోసారి సీఎం అయితే.. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. 


 

click me!