నిద్ర రావట్లేదని ఆత్మహత్య.. హాస్టల్‌లో రాత్రిళ్లు తిరుగుతూ.. చివరకు తీవ్ర నిర్ణయం

By Mahesh KFirst Published Sep 6, 2022, 5:12 AM IST
Highlights

ఒడిశాలో ఓ అమ్మాయి తనకు నిద్ర రావడం లేదని తాను ఉంటున్న ప్రైవేటు హాస్పిటల్ రాత్రిళ్లూ తిరుగుతుండేది. దీనిపై కొందరు హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి కూడా మానసికంగా కుంగిపోయి తనకు నిద్ర రావట్లేదనే కారణంతో ఆత్మహత్య చేసుకుంది.
 

న్యూఢిల్లీ: ఒడిశాలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. మారుతున్న జీవన శైలి, ఒత్తిళ్లతో మానసికంగా చాలా మంది అనారోగ్యులుగానే మిగిలిపోతున్నారు. కనీసం ఈ సమస్య పైనా అవగాహన పెంచుకోవడం లేదు. మానసిక నిపుణులను సంప్రదించడం లేదు. ఆ మానసిక ఒత్తిళ్లలోనే కుంగిపోతున్నారు. కొన్నిసార్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుని తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. నర్సింగ్ చదువుతున్న ఓ అమ్మాయి నిద్ర రావట్లేదని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.

ఆ అమ్మాయి ఇంటికి దూరంగా హాస్టల్‌లో ఉంది. మెడిసిన్ చదువుతుండేది. బాలోంగిర్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని జముకోలిలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నది. కానీ, కొన్ని రోజులుగా ఆమెకు నిద్ర పట్టడం పెద్ద ప్రహసనంగా మారింది. నిద్ర కోసం రాత్రిళ్లు పరితపించిపోయేది. ఎంత ప్రయత్నించినా కంటి రెప్ప వాలేది కాదు. ఏం చేయాలో తోచక హాస్టల్‌లో తిరుగేది. కానీ, అలా తిరగడం ఇతరులను ఇబ్బంది పెడుతున్నదనే విషయం ఆమె గ్రహించలేదు. అయితే, ఇతర విద్యార్థుల ఆమె తీరు పట్ల మాట్లాడుకోవడాన్ని చూసి వార్డెన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. ఇది తెలుసుకుని తల్లిదండ్రులు కూడా ఆందోళనలో మునిగిపోయరు. కూతురు దగ్గరకు వెళ్లాలని అనుకున్నారు. 

అయితే, తల్లిదండ్రులు ఆ హాస్పిటల్ వచ్చే లోపే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఆమె స్పష్టం చేసింది. తనకు నిద్రపట్టక పోవడమే ఒక సమస్యలా తనను పీడిస్తున్నదని ఆ బాలిక రాసుకుంది. తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసింది. ఆ అమ్మాయి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

click me!