సోమవారం నుంచి నర్సరీ స్కూళ్లు రీఓపెన్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Published : Feb 12, 2022, 07:53 PM IST
సోమవారం నుంచి నర్సరీ స్కూళ్లు రీఓపెన్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సారాంశం

కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా నర్సరీ స్కూళ్లను తెరవడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలనూ పూర్తి సామర్థ్యంలో నిర్వహించడానికి అనుమతులు ఇచ్చింది. వీటితోపాటు మరికొన్ని సడలింపులను ప్రకటించింది.  

లక్నో: కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా కరోనా ఆంక్షలను రాష్ట్రాలు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంలోనే పాఠశాలను రీఓపెన్ చేసే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరో అడుగు ముందుకు వేసి ఏకంగా నర్సరీ పాఠశాలలనూ తెరవాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు రీఓపెన్ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే 9వ తరగతి నుంచి 12వ తరగతులకు పాఠశాలలు  తెరిచిన సంగతి తెలిసిందే.

వీటితోపాటు ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలను ఫుల్ కెపాసిటీతో నడవడానికి యూపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిమ్‌లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, హోటళ్లు కూడా కరోనా నిబంధనలతో పూర్తి స్థాయిలో నడిపించుకోవచ్చని తెలిపింది. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులు మాత్రం మూసే ఉంటాయని స్పష్టం చేసింది. 

యూపీలో శుక్రవారం 2,321 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, 13 మంది ఈ మహమ్మారి మూలంగా మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త కేసులు నమ్మదిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. టీకా పంపిణీ రేటు కూడా భారీగా పెరగడంతో చాలా రాష్ట్రాలు పాఠశాలలను తెరిచాయి.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 896 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,12,029కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల అనంతపురం జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,694కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 8,849 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,72,881కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 24,066 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,28,09,000కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,454 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 21, చిత్తూరు 52, తూర్పుగోదావరి 206, గుంటూరు 141, కడప 23, కృష్ణ 130, కర్నూలు 23, నెల్లూరు 29, ప్రకాశం 73, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 60, విజయనగరం 17, పశ్చిమ గోదావరిలలో 113 చొప్పున వైరస్ బారినపడ్డారు.

(covid -19) ఇంకా ముగిసిపోలేద‌ని మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉంద‌ని డ‌బ్లూహెచ్ వో (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ (Soumy swaminathan) అన్నారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో వచ్చే కరోనావైరస్ వేరియంట్‌ల గురించి హెచ్చరించారు. ‘‘ వైరస్ పరిణామం చెందడం, పరివర్తన చెందడం మనం గమనించాం. కాబట్టి మరిన్ని వైవిధ్యాలు, ఆందోళ‌న‌క‌రమైన ర‌కాలు ఉంటాయ‌ని తెలుసు. ఇప్పుడే మహమ్మారి ముగింపు ద‌శ‌లో ఉన్నామ‌ని చెప్ప‌లేం ’’ అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu