నేడే నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

By narsimha lodeFirst Published Sep 7, 2022, 10:20 AM IST
Highlights

నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.ఈ ఏడాది జూలై  మాసంలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
 

న్యూఢిల్లీ: నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం నాడు విడుదల కానున్నాయి. నీట్ ప్రవేశ పరీక్షలను ఆలస్యంగా నిర్వహించారు.  ఈ ఏడాది ఆగష్టు 11న జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశంలో వైద్య విద్య అభ్యసించేందుకు గాను నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి  ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్లను గత నెల 30వ తేదీ నాటికే  వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.

నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరి అభ్యర్ధులకు 40 పర్సంటైల్ గా నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్ధులు 50 శాతం పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది.నీట్ యూజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సిలింగ్ ను నిర్వహించనున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ ప్రక్రియను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను mcc. nic. in లో ప్రకటించనున్నారు.

నీట్ ప్రవేశ పరీక్ష ఏడాది జూలై 17న నిర్వహించారు. ఈ పరీక్షలు రాసేందుకు గాను 18.7 2 లక్షల మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. దేశంలోని 497 నగరాల్లో ఈ ప్రవేశ పరీక్ష కోసం 3570 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 95 శాతం అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు.నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను https://neet.nta.nic. in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
 

click me!