భార్య వంట చేయలేదని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన వృద్ధుడు..!

Published : Sep 07, 2022, 09:55 AM IST
భార్య వంట చేయలేదని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన వృద్ధుడు..!

సారాంశం

క్రికెట్ బ్యాట్ తీసుకొని తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత భయమేసి.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. తన భార్య మెట్ల మీద నుంచి జారి పడిపోయిందని చెబుతూ.. ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.

ఓ వృద్ధుడు కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అది కూడా భార్య వంట చేయడానికి నిరాకరించిందనే కారణంతో క్రికెట్ బ్యాట్ తో  కొట్టి చంపడం గమనార్హం. ఈ సంఘటన డెహ్రడూన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డెహ్రాడూన్ కి చెందిన 73ఏళ్ల వృద్ధుడు రామ్ సింగ్  ఓ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. కాగా... అతను తన భార్య ఉషా దేవి(53) దారుణంగా చంపేశాడు. ఆమె వంట చేయడానికి నిరాకరించందనే కారణంతో.. క్రికెట్ బ్యాట్ తీసుకొని తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత భయమేసి.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. తన భార్య మెట్ల మీద నుంచి జారి పడిపోయిందని చెబుతూ.. ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.

అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు రామ్ సింగ్ పై అనుమానం రావడంతో.. అతనిని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో అతను నిజం అంగీకరించాడు. తన భార్య మెట్ల మీద నుంచి జారి పడలేదని...  తానే బ్యాట్ తో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు.

కాగా... తన భార్య ఇంట్లో ఏ పని చేయడం లేదని... కనీసం తినడానికి భోజనం కూడా చేయదని రామ్ సింగ్ వాపోయాడు. దీంతో.. ఈ విషయంలో తమ భార్యభర్తలకు వాగ్వాదం జరిగిందని.. ఈ క్రమంలోనే కోపంతో బ్యాట్ తో కొట్టినట్లు అంగీకరించాడు. దీంతో... నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని కోర్టులో కూడా హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌